iDreamPost
android-app
ios-app

Hyderabad News: మగాళ్ళకి రక్షణ లేదా? యాంకర్ ని కిడ్నాప్ చేసి యువతి వేధింపులు!

  • Published Feb 23, 2024 | 4:17 PM Updated Updated Feb 23, 2024 | 4:44 PM

హైదరాబాద్ ఉప్పల్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఐదు స్టార్టప్ కంపెనీలకు అధిపతి అయిన ఓ బిజినెస్ ఉమెన్.. ఓ టీవీ ఛానల్ యాంకర్ ను అపహరించింది. రూంలో మూడు రోజుల పాటు బంధించి

హైదరాబాద్ ఉప్పల్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఐదు స్టార్టప్ కంపెనీలకు అధిపతి అయిన ఓ బిజినెస్ ఉమెన్.. ఓ టీవీ ఛానల్ యాంకర్ ను అపహరించింది. రూంలో మూడు రోజుల పాటు బంధించి

  • Published Feb 23, 2024 | 4:17 PMUpdated Feb 23, 2024 | 4:44 PM
Hyderabad News: మగాళ్ళకి రక్షణ లేదా? యాంకర్ ని కిడ్నాప్ చేసి యువతి వేధింపులు!

వామ్మో.. అమ్మాయిలు మామూలుగా లేరుగా.. మనస్సు పడ్డ యువకుడి కోసం ఎంతకైనా తెగిస్తామంటున్నారు. తనను కాదంటే తాట తీయడం పక్కన పెడితే..కాళిక మాత అవతారం ఎత్తుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ తరహా ఘటన వెలుగు చూసింది. ఓ టీవీ ఛానల్ యాంకర్ ప్రణవ్‌ను కిడ్నాప్ చేసిందో బిజినెస్ ఉమెన్. ఉప్పల్‌లోని నిర్మాన్యుష్య ప్రాంతంలోని ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఓ రూంలో బంధించి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించింది. ఆమె చెర నుండి ఎలాగో తప్పించుకుని బయటపడ్డ ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ మెట్రిమోనీలో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది త్రిష్ణ. అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది.

వెంటనే ప్రణవ్ ను కాంట్రాక్ట్ అయ్యి.. ప్రపోజల్ పెట్టింది. అయితే అతడు ఈ పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకున్న త్రిష్ణ, అతడ్ని కిడ్నాప్ చేసి… ఉప్పల్‌లోని నిర్మాన్యుష ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో బంధించింది. మూడు రోజుల పాటు నిర్బంధించి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బందికి గురి చేసింది. చివరకు ప్రణవ్ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.  ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎండీగా వ్యవహరిస్తున్న త్రిష్టన అతడిపై మనస్సు పడింది. అతడ్ని పెళ్లి చేసుకోవాలని భావించి.. కిడ్నాప్ చేయగా.. కథ అడ్డం తిరిగింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఉప్పల్ పోలీసులు త్రిష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom