iDreamPost
android-app
ios-app

కొడుకుతో కలిసి కూతురుని హత్య చేసిన తల్లి! కారణం తెలిసి షాకైన పోలీసులు!

  • Published Nov 08, 2023 | 4:28 PM Updated Updated Nov 08, 2023 | 4:28 PM

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కుమారుడి చేతులు కలిపి కన్న కూతురిని అతి దారుణంగా హత్య చేసింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగాా మారుతోంది. అసలేం జరిగిందంటే?

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కుమారుడి చేతులు కలిపి కన్న కూతురిని అతి దారుణంగా హత్య చేసింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగాా మారుతోంది. అసలేం జరిగిందంటే?

  • Published Nov 08, 2023 | 4:28 PMUpdated Nov 08, 2023 | 4:28 PM
కొడుకుతో కలిసి కూతురుని హత్య చేసిన తల్లి! కారణం తెలిసి షాకైన పోలీసులు!

నేటి కాలం యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా చాలా కాలంగా ప్రేమలో మునిగిపోతున్నారు. ఇక చివరికి ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించడం లేదు. అయినా సరే పెద్దలు ఎదురించి మరి పెళ్లి చేసుకుంటున్నారు. ఇది నచ్చని యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంతే కాకుండా అతడిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఏపీలో తాజాగా ఇలాంటి పరువు హత్య ఘటన కలకలం సృష్టించింది. ఓ మహిళ కుమారుడితో కలిసి కూతురుని అతి దారుణంగా హత్య చేసింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల (17) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమించింది. అతడు కూడా కోమలను ప్రేమించాడు. అలా కాలం నుంచి వీరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కోమలికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే కోమలి.. ప్రేమించిన వాడినే వివాహం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. కూతురు మాటలు విన్న తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది.

పరువు పోతుందని ఆ బాలికకు ఎన్నో సార్లు కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ, ఆ బాలిక మాత్రం ప్రేమించిన వాడితోనే జీవితాంతం ఉండాలని అనుకుంది. ఇదే విషయం ఆమె తల్లికి అర్థమయ్యేటట్లు వివరించింది. ఇయితే కూతురు మాట వినకపోవడంతో తల్లి కోపంతో ఊగిపోయింది. తన కుమారుడితో కలిసి కోమలిని చితకబాదారు. ఆ తర్వాత తల్లి, కుమారుడు కలిసి ఆ బాలిక గొంతుకు చున్నీ బిగించి దారుణంగా హత్య చేశారు. కూతురు చనిపోయిందని తెలుసుని ఆ మహిళ షాక్ గురైంది. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక తల్లి, కుమారుడు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పి లొంగిపోయారు.

అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఘటన స్థలానికి చేరుకుని ఆ బాలిక మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రేమ వ్యవహారం కారణంతో కుమారుడి సాయంతో కూతురిని చంపిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom