iDreamPost
android-app
ios-app

ఏపీలో దారుణం.. భార్యకు దెయ్యం పట్టిందని భర్త హత్య చేశాడు!

  • Published Aug 02, 2023 | 6:13 PM Updated Updated Aug 02, 2023 | 6:13 PM
  • Published Aug 02, 2023 | 6:13 PMUpdated Aug 02, 2023 | 6:13 PM
ఏపీలో దారుణం.. భార్యకు దెయ్యం పట్టిందని భర్త హత్య చేశాడు!

ప్రపంచమంతా టెక్నాలజీ యుగంలో పరుగు పెడుతుంటే.. నేటికి మారుమూల గ్రామాల ప్రజలు మూఢ నమ్మకాల్లోనే బతికేస్తున్నారు. వీటిని నమ్ముకుని వైద్యుడిని సంప్రదించకుండా చివరికి చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. దెయ్యం పట్టిందనే నెపంతో ఓ భర్త తన భార్యను కొట్టాడు. ఇతని దాడిలో గాయపడ్డ మహిళ చివరికి మరణించింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మరుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామం. ఇక్కడే విజయ్ కుమార్-మనీషా (25) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి ఈ దంపతుల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కోపంతోనే భర్త విజయ్ కుమర్ భార్యకు భోజనం కూడా పెట్టకుండా హింసించేవాడట. ఈ క్రమంలోనే మనీషాకు ఇటీవల ఫిట్స్ రావడంతో భర్త దెయ్యం పట్టిందని భార్యను తీవ్రంగా కొట్టడాడు. దీంతో ఆ మహిళ ఇంట్లో పడిపోయింది.

ఇక స్థానికులు వెంటనే గమనించి ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ మనీషా తాజాగా ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణవార్తతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తండ్రి.. నా కూతురుని ఆమె భర్త చాలా కాలం నుంచి హింసిస్తున్నాడని, ఇటీవల ఫిట్స్ వస్తే దెయ్యం పట్టిందని కొట్టి చంపాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్యకు దెయ్యం పట్టిందని కొట్టి చంపిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom