కోల్‌కత్తా డాక్టర్‌ కేసు! నటికి అత్యాచార బెదిరింపులు!

Mimi Chakraborty, Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు విషయంలో.. బెంగాల్‌ నటికి హత్యాచార బెదిరింపులు వచ్చాయి. వాటిపై ఆమె స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

Mimi Chakraborty, Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు విషయంలో.. బెంగాల్‌ నటికి హత్యాచార బెదిరింపులు వచ్చాయి. వాటిపై ఆమె స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

‘కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత 12 రోజులుగా ఈ దారుణ సంఘటనపై డాక్టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ అంశంపై స్పందించిన బెంగాలి నటి మిమీ చక్రవర్తికి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుతూ.. మిమీ సైతం నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

వాటికి సంబంధించిన వీడియోను సైతం ఆమె తన సోషల్‌ మీడియాలో అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. వాటికి కొంతమంది అసభ్యకరమైన కామెంట్ల పెట్టారు. వాటిని స్క్రీన్‌షాట్లు తీసి.. ‘మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం అంటేనే ఇదేనా? స్త్రీల పక్షాన నిలబడతామంటూ గుంపులో ముసుగు వేసుకునే విషపూరిత పురుషులు ఉండటం సాధారణమైపోయింది. ఇలాంటి వారికి ఏ విద్య, ఏ పెంపకం ఇలా చేయమని చెబుతోంది?’ అంటూ తనపై వచ్చిన అసభ్యకరమైన కామెంట్లపై ఆమె మండిపడ్డారు. మహిళలను గౌరవించని చాలా మంది.. డాక్టర్‌ హత్యాచార ఘటనలాంటివి జరిగినప్పుడు మాత్రం.. మహిళలకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తారాని, ఇలాంటి వాళ్లు ఉన్నంత వరకు సమాజం ఎలా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆమె పోస్ట్‌ పెట్టారు.

మిమీ చక్రవర్తి నటి గానే కాకుండా.. గతంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా కూడా పనిచేశారు. ఇక కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటన విషయానికి వస్తే.. కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఈ నెల 9న ట్రైనీ డాక్టర్‌ హత్యాచారానికి గురైంది. కాలేజ్‌ ఔట్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తించే సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను నిందితుడిగా గుర్తిస్తూ.. పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే సీబీఐ ఆ కాలేజ్‌ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను విచారిస్తోంది. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. మరి ఈ కేసుపై అలాగే నటి మిమీ పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments