iDreamPost
android-app
ios-app

సెల్ టవర్ ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు

సెల్ టవర్ ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు

కొందరు వ్యక్తులు ఫుల్ గా మద్యం సేవించిన తర్వాత ఏం చేస్తారో వాళ్లకే అర్థం కాదు. మరి కొందరు మాత్రం మత్తులో అసలు నిజాలు బయట పెడుతుంటారు. కానీ, తాజాగా ఓ యువకుడు మాత్రం తాగిన మత్తులో ఏకంగా పట్ట పగలు పోలీసులకే చుక్కులు చూపించాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ఏకంగా సెల్ టవర్ ఎక్కి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక కొన్ని గంటల పాటు తలలు పట్టుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతానికి ఓ యువకుడు శనివారం హల్ చల్ చేశాడు. అతిగా మద్యం సేవించాడు. ఇక ఇంతటితో సరిపెట్టిన ఇతగాడు చడిచప్పుడు కాకుండా వాకాడు బస్టాండు సమీపంలో ఉన్న ఓ సెల్ టవర్ ఇక్కాడు. నాకు న్యాయం చేయాలంటూ గొంతెత్తి అరిచాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని కిందకు నానా తంటాలు పడ్డారు.

అయినా దిగని ఆ యువకుడు.. కాసేపు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు చూపించాడు. ఇక మొత్తానికి నచ్చజెప్పి అతడిని కిందకు దించారు. ఆ తర్వాత అతడిని నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అతని సమస్య ఏంటో తెలుసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. తాగిన మత్తులో సెల్ టవర్ ఎక్కిన ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దారుణం: రెండో భార్య మోజులో పడి భర్త కిరాతకం

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet