iDreamPost
android-app
ios-app

Agra: కూతురు సె*క్స్ రాకెట్ లో చిక్కుకుందని బెదిరింపులు.. గుండె పగిలి తల్లి మృతి!

  • Published Oct 04, 2024 | 3:47 PM Updated Updated Oct 04, 2024 | 3:47 PM

Agra: సైబర్ నేరగాళ్ల అరాచకత్వానికి ఓ మహిళా బలైంది. నకిలీ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కి భయపడి గుండె పోటుతో చనిపోయింది.

Agra: సైబర్ నేరగాళ్ల అరాచకత్వానికి ఓ మహిళా బలైంది. నకిలీ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కి భయపడి గుండె పోటుతో చనిపోయింది.

Agra: కూతురు సె*క్స్ రాకెట్ లో చిక్కుకుందని బెదిరింపులు.. గుండె పగిలి తల్లి మృతి!

ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో చాలా దారుణమైన దుర్ఘటన చోటు చేసుకుంది. దాని గురించి తెలిస్తే బాధ కలగక మానదు. సైబర్ నేరగాళ్ల అరాచకత్వానికి అన్యాయంగా ఓ మహిళా బలైంది. నకిలీ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కి భయపడిన ఆ మహిళ పాపం గుండెపోటుతో మరణించారు. ఆమె అన్యాయంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాధిత మహిళా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె కూతురు సె*క్స్ రాకెట్ లో ఇరుక్కుందని ఓ నేరగాడు కాల్ చేశాడు. చాలా దారుణంగా బెదిరించారు. వెంటనే రూ. 1 లక్ష డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. లేకపోతే తన కూతురు వీడియోలను లీక్ చేస్తామని చెప్పాడు. ఏ తల్లికయిన ఇలాంటి ఒక ఫోన్ కాల్ వస్తే తట్టుకుంటుందా? ఈ తల్లి కూడా తట్టుకోలేపోయింది. ఈ వార్త వినగానే వణికిపోయింది. తన కూతురు జీవితం నాశనం అయిపోయిందని తీవ్రంగా భయపడిపోయింది. దాంతో గుండెపోటుకి గురయ్యారు. ఆమెని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. ఆగ్రాలో డిజిటల్ అరెస్ట్ కారణంగా అన్యాయంగా చనిపోయిన మొదటి కేసు ఇది.

బాధిత మహిళ పేరు మాల్తీ వర్మ. ఈమె ఆగ్రా జిల్లా అచ్నేరా టౌన్లో ప్రభుత్వ జూనియర్ హైస్కూల్‌లో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె సెప్టెంబర్ 30న పాఠశాలలో ఉండగా ఆమెకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. నిందితుడి డీపీ చూస్తే పోలీస్ యూనిఫాం ధరించిన వ్యక్తి ఫోటో ఉంది. మీ కూతురు సెక్స్ రాకెట్‌లో చిక్కుకుందని అన్నాడు. ఆమెపై ఇంకా కేసు ఫైల్ కాలేదని, మీ పరువు పోకూడదని, మీ కూతురి ఫోటోలు వైరల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఫోన్ చేశానని, లక్ష రూపాయలు పంపిస్తే వదిలేస్తామని చెప్పాడు. ఒక నెంబర్ పంపించి, దానికి 15 రోజుల్లోగా లక్ష రూపాయలు పంపాలని డిమాండ్ చేశాడు. లేదంటే మీ కూతురిపై చర్యలు తీసుకుంటానని ఆమెను బెదిరించాడు. సుమారు అరగంట పాటు ఆమెని డిజిటల్ అరెస్ట్‌లో ఉంచాడు. దీంతో భయపడిన మాల్తీవర్మ తన కొడుకు దీపాంశుకు ఫోన్ చేశారు. తన కొడుకుకి నిందితుడి నెంబర్ పంపించి, ఆ నెంబర్‌కి లక్ష రూపాయలు పంపాలని చెప్పింది.

అయితే దీపాంశుకి ఈ నెంబర్ చూడగానే అనుమానం వచ్చింది. ఈ నెంబర్ మన దేశానిది కాదని అనిపించింది. ఆ నెంబర్ తప్పుగా ఉందని తల్లి మాల్తీ వర్మకు చెప్పాడు. దీంతో తనకు వచ్చిన కాల్ గురించి కుమారుడితో చెప్పింది. అప్పటికీ తన కూతురు సె*క్స్ రాకెట్‌లో చిక్కుకుందనే భయంలోనే ఉంది. దీపాంశు తన ఇద్దరు సోదరీమణులు ఎక్కడ ఉన్నారని ఆరా తీయగా, ఒకరు పాఠశాలలో మరొకరు బజారులో ఉన్నట్లు తెలిసింది. వారిద్దరిని తల్లితో మాట్లాడించాడు. అయినా కూడా మాల్తీ వర్మ షాక్ నుంచి కొలుకోలేదు. ఇంకా భయంలోనే ఉంది. ఇంటికి వచ్చాక పాపం వెంటనే గుండెపోటుకి గురై చనిపోయారు. ఎంత దారుణం.. ఇలా ఫేక్ కాల్ కి గురై ఆ మహిళా ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ విషాద ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.