Krishna Kowshik
రేణుకా స్వామి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు మరో కన్నడ నటుడికి నోటీసులు పంపారు పోలీసులు.
రేణుకా స్వామి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు మరో కన్నడ నటుడికి నోటీసులు పంపారు పోలీసులు.
Krishna Kowshik
సామాన్యుడ్ని హత్య చేసిన కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్టైన సంగతి విదితమే. ప్రస్తుం పోలీసులో అదుపులో ఉన్నాడు. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకర వీడియోలు, సందేశాలు పంపాడన్న కారణాలతో ఈ నెల 8న చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తిని ఓ షెడ్డులో తీసుకెళ్లి హత్య చేశాడు దర్శన్. ఈ కేసులో పవిత్రతో పాటు 17 మందిని అరెస్టు చేశారు. అలాగే పోస్టుమార్టం రిపోర్టులో అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లు తేలింది. ప్రస్తుతం దర్శన్, పవిత్రలను విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన కన్నడ చిత్ర సీమతో పాటు దక్షిణాది ఇండస్ట్రీని చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మరో కన్నడ నటుడికి పోలీసులు నోటీసులు పంపించారు.
కన్నడ హాస్య నటుడు కమ్ హీరో చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు విచారణకు నటుడు హాజరైనట్లు తెలుస్తోంది. రేణుకా స్వామి హత్య చేయడానికి ముందు జూన్ 8న ఆర్ ఆర్ నగర్‌లోని బ్రూక్ రెస్టోబార్ వద్ద వీరంతా పార్టీ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ పార్టీకి దర్శన్ ఫ్రెండ్, నటుడు చిక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో ఈ హత్య గురించి టాపిక్ ఏమైనా వచ్చిందా అనే కోణంలో అతడ్ని విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. అనంతరం అతడు విచారణలో కొన్ని విషయాలు తెలియజేశాడు. అయితే హత్యతో అతడికి సంంధం లేని కారణంగా అతడ్ని అరెస్టు చేయలేదు. కాగా, దీనిపై చిక్కన్న మీడియాతో మాట్లాడాడు. పోలీసుల నోటీసుపై స్పందించాడు.
‘ఆ సాయంత్రం నన్ను డిన్నర్‌కి పిలిచారు. అందుకే, అక్కడికి వెళ్లాను. దీనిపై విచారణ కోసం పోలీసులు నన్ను పిలిచారు. దర్యాప్తు కొనసాగుతున్నందున, ఇంతకు మించి నేనేమీ మాట్లాడలేను’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టు మార్టం నివేదికలో అత్యంత ఘోరంగా అతడ్ని కొట్టి చంపినట్లు తేలింది. అంతేకాకుండా పవిత్ర కూడా అతడ్ని కొట్టినట్లు తెలుస్తుంది. అందుకే ఆమెతో పాటు పలువురు ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఆమె వినియోగించిన దుస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడ్ని బెంగళూరుకు తరలించిన రాఘవేంద్రతో సహా కొంత మంది అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. రాఘవేంద్ర నివాసంలో గొలుసు, ఉంగరం రేణుకా స్వామిది అని నిర్ధారించారు. అలాగే బాధితుడు బంధువులు, స్నేహితులను కూడా విచారించారు.