MP కుమారుడు మోసం చేశాడని మహిళ ఫిర్యాదు.. అతనెవరో కాదు..!

బీజేపీ ఎంపీ కుమారుడు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బీజేపీ ఎంపీ కుమారుడు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు, సహజీవనం, ప్రేమ పేరుతో మోసం వంటి కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మొదట్లో ప్రేమిస్తున్నామని నమ్మించి,  ఆ తర్వాత పెళ్లి పేరుతో అన్నీ చేసి చివరికి మోసం చేస్తున్నారు కొందరు. దీంతో మోస పోయామని తెలుసుకుని బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా  వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఎంపీ కుమారుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఆ ఎంపీ ఎవరు, ఆయన కుమారుడు ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక బళ్లారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ మైసూర్ మహారాజా కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఇతను ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆ మహిళతో చాలా సార్లు శారీరకంగా కూడా కలిశాడని వార్తులు వినిపిస్తున్నాయి. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ కలిసి తిరిగినట్లుగా కూడా తెలుస్తుంది. కట్ చేస్తే.. ఎంపీ కుమారుడు రంగనాథ్ ఆమెతో పెళ్లికి నిరాకరించి ఆ మహిళను మోసం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే బాధితురాలు మహిళ తాజాగా బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీసులను ఆశ్రయించింది.

బళ్లారి బీజేపీ ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారరీకంగా వాడుకున్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి పేరు ఎత్తగానే మెహం చాటేస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎంపీ కుమారుడు ఇలా చేయడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై స్పందించిన కొందరు నెటిజన్స్.. ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు చేసిన ఈ పనితో అతనికి రాజకీయంగా చాలా మైనస్ గా మారే అవకాశాలు లేకపోలేదని కామెంట్స్ చేస్తున్నారు. బళ్లారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ ఓ మహిళను మోసం చేశాడని చెబుతున్న మహిళ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments