iDreamPost
android-app
ios-app

పోటీ పరీక్షకు కొత్త పెళ్లి కూతురు వేషంలో.. తీరా చూస్తే అవాక్కైన అధికారులు

ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలన్న కసితో నోటిఫికేషన్ రాగానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రిపేర్ అవుతుంటారు కొందరు. కొంత మంది అక్రమ మార్గాన్ని అనుసరిస్తున్నారు. టెక్నాలజీ సాయం లేదా చీటీలు పెడుతూ ఉంటారు. మనం చెప్పుకోబోయేది మాత్రం అడ్వాన్స్ డ్ చీటింగ్..

ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలన్న కసితో నోటిఫికేషన్ రాగానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రిపేర్ అవుతుంటారు కొందరు. కొంత మంది అక్రమ మార్గాన్ని అనుసరిస్తున్నారు. టెక్నాలజీ సాయం లేదా చీటీలు పెడుతూ ఉంటారు. మనం చెప్పుకోబోయేది మాత్రం అడ్వాన్స్ డ్ చీటింగ్..

పోటీ పరీక్షకు కొత్త పెళ్లి కూతురు వేషంలో.. తీరా చూస్తే అవాక్కైన అధికారులు

కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుండే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యాక.. కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆ తర్వాత మరింత పట్టుదలతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకసారి ఓడిపోయినా..అలుపెరగకుండా గవర్నమెంట్ జాబ్ కోసం దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఇటీవల కాలంలో మనుషులు తెలివి మీరిపోయారు.టెక్నాలజీ సాయంతో పరీక్షల్లో కాపీ కొట్టేందుకు సిద్ధమౌతున్నారు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మాత్రం నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తుంది. తన ప్లేసులో మరో వ్యక్తిని పంపింది. అదీ కూడా అమ్మాయి వేషంలో. కానీ.. నిజం దాగలేదు.

ఇంతకు ఏం జరిగిందంటే.. పంజాబ్‌లోని ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. పారా మెడికల్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 806 మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ పోస్టులకు, మరో 83 పోస్టులకు ఆదివారం పరీక్ష నిర్వహించింది. ఫరీద్ కోట్, ఫిరోజ్ పూర్, కొట్కాపూర్‌లో 26 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 7500 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి వచ్చారు. అయితే కొట్కాపురంలో డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి అమ్మాయి క్యాప్ పెట్టుకుని వచ్చింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలా కనిపించింది. అయితే ఆమెపై అనుమానం వ్యక్తం చేసిన యూనివర్శిటీ అధికారులు బయోమెట్రిక్ సాయంతో నిజం తెలుసుకున్నారు. ఆ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయి అసలు అభ్యర్థే కాదని నిర్దారించుకున్నారు.

In the dress of the bride for the exam

తీరా చూస్తే.. అసలు ఆమె.. మహిళ కాదూ.. ఓ అబ్బాయి. అబ్బాయి అమ్మాయి వేషంలో పరీక్ష రాసేందుకు వచ్చాడని తెలిసి అవాక్కయ్యారు అధికారులు. పోలీసులకు సమాచారం అందించారు. ఆ అబ్బాయి ఫాజిల్కా నివాసి జగార్త్ సింగ్ కుమారుడు అంగ్రేజ్ సింగ్‌గా గుర్తించారు. ధనీ మున్షీరామ్ గ్రామ నివాసి భజన్ లాల్ కుమార్తె పరమ్ జిత్ కౌర్ రాయాల్సిన పరీక్షను..అంగ్రేజ్ సింగ్ లేడీ గెటప్ వేసుకుని వెళ్లి.. అధికారులకు చిక్కాడు. పరమ్ జిత్ కౌర్ అని నిర్ధారించేందుకు నకిలీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు కూడా సృష్టించుకున్నాడు. అన్నీ పకడ్బందీగా సమకూర్చుకున్న అంగ్రేజ్ సింగ్..అమ్మాయి గెటప్‌లో పరీక్షా కేంద్రంలోకి వెళ్లగలిగాడు కానీ.. బయెమెట్రిక్ సాయంతో దొరికిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నయా చీటింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.