iDreamPost
android-app
ios-app

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్!

  • Published Sep 30, 2023 | 1:16 PM Updated Updated Sep 30, 2023 | 1:16 PM
  • Published Sep 30, 2023 | 1:16 PMUpdated Sep 30, 2023 | 1:16 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. దీంతో ఖంగారుపడి అటు ఇటు అంతటా వెతికాడు. కానీ, కొడుకు ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆ బాలుడిని ఓ దంపతులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా రాయలపురం గ్రామానికి చెందిన దర్గుష్ అనే వ్యక్తి తన 8 ఏళ్ల కుమారుడితో ఇటీవల శ్రీవారిని దర్శనానికి తిరుమల వెళ్లాడు. ఇక దర్శన అనంతరం దుర్గుష్ ఈ నెల 28న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాడు. కాగా, ఆ వ్యక్తి తన కుమరుడిని ఒకటో ప్లాట్ ఫాంపై ఉంచి వాష్ రూమ్ కు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు అక్కడ కనిపించలేదు. దీంతో ఖంగారుపడి స్టేషన్ మొత్తం వెతికాడు. కానీ, కుమారుడి ఆచూకి మాత్రం దొరకలేదు.

ఇక చేసేదేంలేక స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆ బాలుడిని ఓ దంపతులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇది పక్కా బెగ్గింగ్ మాఫియా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet