iDreamPost
android-app
ios-app

కోల్‌కత్తా డాక్టర్‌ కేసు! అదే కాలేజీలో 2001లో జరిగిన దారుణం గురించి తెలుసా?

  • Published Aug 19, 2024 | 4:09 PM Updated Updated Aug 19, 2024 | 4:09 PM

Kolkata, RG Kar Medical College, Soumitra Biswas: సంచలనంగా మారిన కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచారం కేసులో.. మరో విస్తూపోయే నిజం వెలుగులోకి వచ్చింది. ఇదే కాలేజీలో 23 ఏళ్ల క్రితం జరిగిన మరో దారుణం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Kolkata, RG Kar Medical College, Soumitra Biswas: సంచలనంగా మారిన కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచారం కేసులో.. మరో విస్తూపోయే నిజం వెలుగులోకి వచ్చింది. ఇదే కాలేజీలో 23 ఏళ్ల క్రితం జరిగిన మరో దారుణం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 19, 2024 | 4:09 PMUpdated Aug 19, 2024 | 4:09 PM
కోల్‌కత్తా డాక్టర్‌ కేసు! అదే కాలేజీలో 2001లో జరిగిన దారుణం గురించి తెలుసా?

మనుషుల ప్రాణాలు నిలిపే వైద్యురాలిని.. అతి దారుణంగా అత్యాచారం చేసి, అంతకంటే క్రూరంగా హింసించి మరి చంపిన ఘటన కోల్‌కత్తాలో చోటు చేసుకుంది. కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. డాక్టర్లతో పాటు సామాన్యులు, సెలబ్రెటీలు, మహిళా సంఘాలు అంతా ఈ దారుణంపై స్పందిస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని గత పది రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం’ కేసును తాజాగా సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే కాలేజీలో 2001లో జరిగిన దారుణం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పుడ కూడా ఓ వైద్య విద్యార్థిని బలైపోయింది.

2001లో అసలేం జరిగింది?

కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఫోర్త్‌ ఇయర్‌ స్టూడెంట్‌ సౌమిత్రా బిస్వాస్‌ 2001 ఆగస్టు 25న తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. ప్రాథమికంగా ఆమెది ఆత్మహత్యగా భావించారు. కానీ, ఆ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్యాన్‌కు వేలాడుతున్న శవాన్ని కిందికి దింపి చూసిన తర్వాత.. ఆమె నోట్లో ఒక కర్చీఫ్‌ కుక్కి ఉంది. దాంతో.. ఆమెను ఎవరో హత్య చేసి.. ఇలా ఫ్యాన్‌కు వేలాడదీశారని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత వారి అనుమానమే నిజమైంది.

సెక్స్‌ రాకెట్‌కు బలైంది..!

సౌమిత్రా హత్యకు ముందు.. ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ సెక్స్‌ రాకెట్‌కు అడ్డాగా మారింది. బయటి నుంచి సెక్స్‌ వర్కర్లను రప్పించి.. వారితో అశ్లీల వీడియోలు షూట్‌ చేయించి.. వారి ముఖాలకు ప్రముఖ మోడల్స్‌ ముఖాలను ‘సూపర్‌ ఇంపోస్‌’ చేసేవారు. కొన్నిసార్లు హాస్టల్‌లో ఉండే మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ ముఖాలను కూడా ఆ అశ్లీల వీడియోలకు జతచేసే వారు. వాటిని చూపించి.. మెడికల్‌ స్టూడెంట్స్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. వారిని కూడా ఆ ఉచ్చులోకి దింపేవారు. ఒక్కోసారి సెక్స్‌ వర్కర్లు దొరక్కపోతే.. హాస్పిటల్‌లోని శవాలను సైతం నగ్నంగా వీడియోలు తీసేవారు. ఇదంతా ఒక రాజకీయ నేత కనుసన్నల్లో జరిగేది.

RG kar kolkata medical college

గుట్టురట్టు చేస్తుందని.. చంపేశారు!

ఈ సెక్స్‌ రాకెట్‌లో చిక్కుకుని తన స్నేహితురాలు బాధపడుతున్నట్లు గుర్తించిన సౌమిత్రా బిస్వాస్‌.. ఈ వ్యవహారాన్ని ఎలాగైనా బయటపెట్టాలనుకుంది. ఈ విషయం ఆ సెక్స్‌ రాకెట్‌ వాళ్లకు తెలిసి.. ఆమెను పక్కా పథకం ప్రకారం హత్య చేసి.. ఆమె హాస్టల్‌ రూమ్‌లోనే ఫ్యాన్‌కు వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ, అరవకుండా నోట్లో కుక్కిన కర్ఛీఫ్‌ వారి దారుణాన్ని వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఈ ఘటన కోల్‌కత్తాలో పెను సంచలనం సృష్టించింది. మరోసార.. 23 ఏళ్ల తర్వాత.. దేశాన్ని కుదిపేసే పెను సంఘటనకు అదే ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ వేదికైంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet