iDreamPost
android-app
ios-app

రెస్టారెంట్ మెనూలోని ఏఐ ఫుడ్ ఫోటోలను తొలగిస్తున్న జొమాటో

  • Published Aug 19, 2024 | 4:21 PM Updated Updated Aug 19, 2024 | 4:25 PM

Zomato Key Decision On Restaurants: జొమాటో యాప్ ద్వారా పలు రెస్టారెంట్స్ లలో కస్టమర్స్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే ఆర్డర్ పెట్టుకునే ముందు మెనూలో ఉన్న ఐటమ్స్ నే చూస్తారు. వాటిలో నచ్చింది ఆర్డర్ చేసుకుంటారు. ఈ విషయంలో తాము మోసపోతున్నామని కస్టమర్స్ ఫిర్యాదులు చేయడంతో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది.

Zomato Key Decision On Restaurants: జొమాటో యాప్ ద్వారా పలు రెస్టారెంట్స్ లలో కస్టమర్స్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే ఆర్డర్ పెట్టుకునే ముందు మెనూలో ఉన్న ఐటమ్స్ నే చూస్తారు. వాటిలో నచ్చింది ఆర్డర్ చేసుకుంటారు. ఈ విషయంలో తాము మోసపోతున్నామని కస్టమర్స్ ఫిర్యాదులు చేయడంతో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది.

రెస్టారెంట్ మెనూలోని ఏఐ ఫుడ్ ఫోటోలను తొలగిస్తున్న జొమాటో

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జొమాటో యాప్ ని వినియోగిస్తున్నారు. అనేక రెస్టారెంట్స్, హోటల్స్ లలో నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ని ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. జొమాటోలో ఆర్డర్ చేస్తే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్న నమ్మకాన్ని జొమాటో కలిగించింది. అయితే మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఆ చెడుపైనే జొమాటో ఇప్పుడు యుద్ధం ప్రకటించింది. సాధారణంగా యాప్ లోకి వచ్చిన తర్వాత కస్టమర్ ఫస్ట్ చూసేది మెనూనే. ఆ మెనూలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ లో నచ్చిన వంటకాన్ని ఎంచుకుంటారు. ఆ మెనూలో వంటకాల చిత్రాలని చూసే కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే ఆ చిత్రాలను చూసి కొంతమంది కస్టమర్లు మోసపోతున్నారు. ఎందుకంటే ఆ చిత్రాలు ఏఐ ఆధారంగా రూపొందించబడినవి. ఏఐ ఆధారంగా ఆకర్షణీయమైన చిత్రాలను సృష్టించవచ్చు.

ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఈ రెస్టారెంట్స్ లలో కూడా ఏఐని వాడుకుంటున్నారు. రెస్టారెంట్స్ లో వండే వంటకాలకు సంబంధించి అసలు చిత్రాలను కాకుండా ఏఐ చిత్రాలు పెడుతున్నారు. వాళ్ళ దగ్గర హై క్వాలిటీ కెమెరా లేక ఏఐ ఫోటోస్ పెట్టడం లేదా వాళ్ళ వంటకాలు అంత ఆకర్షణీయంగా లేకపోవడం వంటి కారణాల వల్ల కృత్రిమ ఫోటోలను జొమాటో యాప్ లోని వారి వారి రెస్టారెంట్ మెనూలో యాడ్ చేస్తున్నారు. అయితే దీని వల్ల కస్టమర్ మోసపోతున్నాడని జొమాటో గుర్తించింది. ఇమేజ్ ని చూసి ఆకర్షణకు గురైన కస్టమర్ ఆ ఇమేజ్ లో ఉన్న ఫుడ్ ఐటంని ఆర్డర్ పెడుతుంటే తీరా డెలివరీ అయ్యాక అది అందులో ఉన్నట్లు ఉండడం లేదు.

దీంతో చాలా మంది కస్టమర్లు జొమాటోకి ఫిర్యాదులు చేశారు. ఏఐ ఆధారంగా సృష్టించిన ఆహార పదార్థాల చిత్రాలను జొమాటో యాప్ నుంచి తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఏఐ ఆధారిత చిత్రాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కస్టమర్స్ నుంచి ఫిర్యాదులు అందాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో సీఈఓ వెల్లడించారు. తమ పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి జొమాటో యాప్ లో ఏఐని ఉపయోగిస్తున్నామని.. అలా అని రెస్టారెంట్ మెనూల్లో ఏఐతో సృష్టించిన ఫుడ్ ఐటమ్స్ ఇమేజెస్ ని ఆమోదించమని అన్నారు. ఏఐ ఆహార పదార్థాల చిత్రాలు కస్టమర్స్ ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, దీన్ని విశ్వాసఘాతుకంగా అభివర్ణిస్తున్నామని అన్నారు. ఇది అధిక ఫిర్యాదులు, రిఫండ్ లు, తక్కువ రేటింగ్ లకు దారి తీయొచ్చునని అన్నారు. అందుకే మెనూ ఐటమ్స్ కోసం ఏఐ చిత్రాలను వాడొద్దని మాతో భాగస్వామ్యం కలిగిన రెస్టారెంట్స్ ని కోరుతున్నామని దీపిందర్ గోయల్ అన్నారు.

ఈ నెలాఖరు లోగా మెనూల నుంచి ఏఐ ఫుడ్ చిత్రాలను తొలగించడం ప్రారంభిస్తామని.. ఇక నుంచి అలాంటి ఫోటోలకు చెక్ పెడతామని అన్నారు. ఆటోమేషన్ ద్వారా ఏఐ ఫుడ్ ఇమేజెస్ ని గుర్తించి తొలగిస్తామని అన్నారు. ఇప్పటి నుంచి రెస్టారెంట్ వాళ్ళు ఏఐ ఫుడ్ చిత్రాలను మెనూ నుంచి తొలగించండి అంటూ దీపిందర్ గోయల్ అభ్యర్థించారు. వంటకాలను ఫోటో తీసేందుకు రెస్టారెంట్ ఓనర్స్ దగ్గర డబ్బులు లేకపోతే జొమాటో కేటలాగ్ సపోర్ట్ టీమ్ ని సంప్రదించాలని కోరారు. తమ టీమ్ వచ్చి వంటకాల ఫోటోలను తీస్తారని అన్నారు. catalogue@zomato.com ద్వారా ఫోటోషూట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చునని అన్నారు. ఫోటోషూట్ కోసం ఎలాంటి ఛార్జీలు జొమాటో వసూలు చేయదని.. ఇది పూర్తిగా ఉచితమే అని జొమాటో సీఈఓ అన్నారు. ఈ ఏఐ ఆధారిత చిత్రాలు అనేవి రెస్టారెంట్స్ కి మాత్రమే కాదని.. మార్కెటింగ్ టీమ్ కి కూడా వర్తిస్తుందని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.