iDreamPost
android-app
ios-app

రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ.. అమ్మాయి ఎవరంటే?

  • Published Mar 22, 2024 | 3:35 PM Updated Updated Mar 22, 2024 | 3:35 PM

ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వెయ్యి నగరాలకు పైగా జొమాటో కార్యకలాపాలు విస్తరించాయి.

ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వెయ్యి నగరాలకు పైగా జొమాటో కార్యకలాపాలు విస్తరించాయి.

రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈఓ.. అమ్మాయి ఎవరంటే?

ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయెల్ ద్వితీయ వివాహం చేసుకున్నాడు. కొంత కాలంగా మెక్సికోకు చెందిన ప్రముఖ మోడల్ అయిన గ్రేసియా మునోజ్ తో కలిసి ఏడడుగులు వేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలోనే వీరు హనీమూన్ కి కూడా వెళ్లొచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే వీరిద్దరి పెళ్లి పై ఎలాంటి అఫిషియల్ ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం ఈ జంట భారత్ లోని తమ స్వగృహంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కోట్లకు అధిపతి అయిన దీపిందర్ చేసుకున్న మోడల్ ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

భారత్ లో దిగ్గజ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు జోమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. జొమాటో యాప్ తో ఎక్కడికైనా ఫుడ్ డెలివరీ చేసుకునే అవకాశం కల్పించబడింది. దీపిందర్ గోయెల్ తాను ప్రేమించిన మోడల్ ని రహస్యంగా రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గ్రేసియా మునోజ్. మెక్సికోలో పుట్టి పెరిగిన మునోజ్.. దీపిందర్ గోయల్ ని పెళ్లి చేసుకొని భారత దేశంలోకి అడుగు పెట్టింది. 2022 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన మెట్రో పాలిటన్ ఫ్యాషన్ వీక్ మునోజ్ విజేతగా నిలిచింది. అయితే దీపిందర్ గోయల్ కి ఇది రెండో పెళ్లి. గతంలో ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు కంచన్ జోషిన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

Zomato CEO

గురుగ్రామ్ కు చెందిన దీపిందర్ గోయల్, పంకజ్ చద్దాతో కలిసి 2008 లో రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ను స్థాపించారు. గతంలో బెయిన్ అండ్ కంపెనీకి కన్సల్టింగ్ గా పనిచేశారు. భారతీయ స్టార్టప్ ల పోస్టర్ బాయ్ గోయల్ ను భారత్ లో సెలబ్రెటీ స్టార్టప్ స్థాపకుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాదు భారత్ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కాగా.. అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం గోయెల్ సంపాదన 650 మిలియన్ డాలర్లు అని అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైమాటే. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.