iDreamPost

మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ కావాలా? అయితే ఇదే బెస్ట్ స్కీమ్

మీరు మంచి రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

మీరు మంచి రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ కావాలా? అయితే ఇదే బెస్ట్ స్కీమ్

నేటి రోజుల్లో మనీ ఉంటేనే మర్యాద ఇస్తున్నారు. సంపాదన ఎంతున్న కూడా అందులో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికే రిస్క్ ఉంటుంది. కాబట్టి మీ వద్ద ఉన్న డబ్బును ఏదో ఒక రూపంలో పెట్టుబడి పెట్టుకుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నప్పటికీ రిస్క్ లేకుండా మంచి రాబడులు అందుకోవాలంటే పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. పోస్టాఫీస్ అందించే ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్ ను అందిస్తుంది. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడితో పాటు గ్యారంటీ రిటర్స్న్ ఉంటాయి. మీ డబ్బు మీకు సురక్షితంగా చేరుతుంది. పోస్టాఫీస్ పథకాల్లో పెట్టే ఇన్వెస్ట్ మెంట్ పై అధిక వడ్డీరేటును అందుకోవచ్చు. కాగా పోస్టాఫీస్ కు చెందిన టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే మీ ఇన్వెస్ట్ మెంట్ పై అధిక ఆదాయాన్ని అందుకోవచ్చు. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి. ప్రస్తుతం ఈ పథకంలో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.8 శాతం వడ్డీ రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 6.9 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు లభిస్తుంది. మీరు ఈ పథకంలో ఐదేళ్ల కాల వ్యవధికి గాను రూ. లక్ష పెట్టుబడిగా పెడితే 7.5 శాతం వడ్డీతో ఐదేళ్లకు మొత్తం రూ. 44,995 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 1,44,995 అందుకోవచ్చు. రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీతో రూ. 1,34,489 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ అప్పుడు మీరు అందుకునే మొత్తం రూ. 4,34,489.

పెట్టుబడి డబుల్:

ఐదేళ్ల కాలానికి రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7,24,149 పొందొచ్చు. అయితే మీరు ఈ మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకోకుండా మరో ఐదేళ్లు కొనసాగిస్తే.. అప్పుడు మీకు రూ. 5,51,175 వడ్డీ లభిస్తుంది. అంటే పదేళ్ల తర్వాత మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. అంటే మీరు పదేళ్ల మెచ్యూరిటీ తర్వాత రూ. 10,51,175 పొందొచ్చు. ఇన్వెస్ట్ మెంట్ పై వచ్చే వడ్డీ రాబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి