iDreamPost
android-app
ios-app

అధిక రాబడి కావాలా? పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే.. వడ్డీతోనే లక్షల్లో లాభం పక్కా!

  • Published Jul 01, 2024 | 5:13 PM Updated Updated Jul 01, 2024 | 5:13 PM

Post office time deposit scheme: మీ డబ్బును మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రూపంలో లక్షల్లో ఆదాయం పొందొచ్చు

Post office time deposit scheme: మీ డబ్బును మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రూపంలో లక్షల్లో ఆదాయం పొందొచ్చు

  • Published Jul 01, 2024 | 5:13 PMUpdated Jul 01, 2024 | 5:13 PM
అధిక రాబడి కావాలా? పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే.. వడ్డీతోనే లక్షల్లో లాభం పక్కా!

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. చేతినిండా డబ్బు ఉంటే ఆ ధైర్యమే వేరు. డబ్బును పొదుపు చేయడం ఓ కళ. మనం ఎంత సంపాదిస్తున్నమనేదానికన్నా.. ఎంత పొదుపు చేస్తున్నమన్నదే ముఖ్యం. డబ్బు తక్కువ సంపాదించే వారికంటే డబ్బును పొదుపు చేయని వారికే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకునే వారు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా జీవించొచ్చు. డబ్బుకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తమ కష్టార్జితాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని భావిస్తున్నారు. మరి మీరు కూడా మీ సొమ్మును మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌ స్కీమ్. ఇందులో పొదుపు చేస్తే పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే లక్షల్లో లాభం అందుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఆద్వార్యంలో పనిచేసే పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడిని పొందొచ్చు. పోస్టాఫీస్ పథకాల్లో అధిక వడ్డీ అందుబాటులో ఉంది. దీంతో మీరు మీ పెట్టుబడిపై అధిక లాభాలను అందుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడిపెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి.

ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.8 శాతం వడ్డీ రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 6.9 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు లభిస్తుంది. మీరు ఈ పథకంలో ఐదేళ్ల కాల వ్యవధికి గాను రూ. లక్ష పెట్టుబడిగా పెడితే 7.5 శాతం వడ్డీతో ఐదేళ్లకు మొత్తం రూ. 44,995 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 1,44,995 అందుకోవచ్చు. రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీతో రూ. 1,34,489 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు అందుకునే మొత్తం రూ. 4,34,489. ఇక ఐదేళ్ల టైమ్ పిరియడ్ కు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7,24,149 పొందొచ్చు. అంటే మీకు పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే రూ. 2,24,974 చేతికి అందుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet