iDreamPost
android-app
ios-app

లక్షల్లో లాభాలు అందించే పోస్టాఫీస్ స్కీం.. నెలకు ఇంత కడితే 15 లక్షలు పొందొచ్చు

  • Published Aug 20, 2024 | 12:48 PM Updated Updated Aug 20, 2024 | 12:48 PM

Post Office Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలు పొందొచ్చు.

Post Office Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలు పొందొచ్చు.

  • Published Aug 20, 2024 | 12:48 PMUpdated Aug 20, 2024 | 12:48 PM
లక్షల్లో లాభాలు అందించే పోస్టాఫీస్ స్కీం.. నెలకు ఇంత కడితే 15 లక్షలు పొందొచ్చు

బ్రతుకు బండి నడవాలంటే సరిపడా డబ్బులు ఉండాల్సిందే. ఆర్ధికంగా బాగున్నామంటే ఏ ఇబ్బందులు దరిచేరవు. అందుకే అంతా డబ్బు సంపాదనకై పరుగులు తీస్తున్నారు. ప్రపంచమంతా డబ్బు వెనకాలే పరుగెడుతున్నది. చాలా మంది పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. సంపాదించిన సొమ్ములో కొంత పొదుపు చేసుకుని ఆ తర్వాతే ఖర్చు చేస్తున్నారు. అయితే పొదుపు చేసిన సొమ్మును ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకుంటే మంచి లాభాలను అందుకోవచ్చు. ఇందుకోసం పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి 15 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?

పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. సురక్షితమైన రాబడిని పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో అధిక వడ్డీరేటు పొందొచ్చు. ఈ పథకంలో వార్షిక ప్రాతిపదికన 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. నెలకు కనీసం రూ. 100 నుంచి డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అవసరమైతే మరో ఐదేళ్లు కూడా పొడిగించుకోవచ్చు.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో రూ. 15 లక్షలు పొందాలంటే నెలకు రూ. 20 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 2.4 లక్షలు జమ అవుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం 12 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై వడ్డీ ఆదాయం 2,27,315 వస్తుంది. ఇక ఐదేళ్లు పెట్టుబడి తర్వాత మెచ్యూరిటీ నాటికి పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని చేతికి మొత్తం రూ. 14,27,315 అందుతుంది. అంటే మీరు దాదాపుగా 15 లక్షలు పొందొచ్చన్నమాట. మీరు ఇంకా ఎక్కువ రాబడిని ఆశిస్తే మరో ఐదేళ్లు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss