P Venkatesh
kisan vikas patra: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితోనే లక్షల్లో లాభం పొందొచ్చు.
kisan vikas patra: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితోనే లక్షల్లో లాభం పొందొచ్చు.
P Venkatesh
తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంటారు. సంపాదించిన మొత్తంలో పొదుపు కోసం కొంత కేటాయిస్తారు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు చాలామంది. ప్రభుత్వాలు సైతం సామాన్య ప్రజల కోసం మంచి రాబడిని అందించే పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ పథకాల్లో ఆడపిల్లలకోసం సుకన్య సమృద్ధి యోజన, మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. అయితే అబ్బాయిల కోసం కూడా సూపర్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేసే పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ను అమలు చేస్తున్నది. ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందొచ్చు.
ఈ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి మెచ్యూరిటీ నాటికి డబుల్ అవుతుంది. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 20 లక్షలు వస్తాయి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశమే లేదు. కిసాన్ వికాస్ పత్ర స్కీం పోస్టాఫీసులతో పాటుగా బ్యాంకుల్లో కూడా తెరవొచ్చు. ఈ పథకంలో కనిష్టంగా 1000 పెట్టుబడిపెట్టొచ్చు. గరిష్టంగా ఎంత పెట్టుబడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 9.7 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంలో 7.5 శాతం వడ్డీరేటు అందించబడుతుంది.
18 ఏళ్లు పైబడిన వారు ఒక్కరిగా లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ పథకంలో చేరొచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఐదు వేలు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ తర్వాత పది వేలు పొందుతారు. అదే 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి 10 లక్షలు పొందొచ్చు. అంటే మీరు ఎంత మొత్తం పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి అది డబుల్ అవుతుందన్నమాట. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. ఈ పథకంలో పది లక్షలు పెట్టుబడి పెడితే, పథకం మెచ్యూరిటీ కాలానికి అంటే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో 20 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు.