iDreamPost
android-app
ios-app

రోజుకు రూ. 18 పొదుపు చేస్తే లక్షల్లో లాభం!.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్!

  • Published Aug 06, 2024 | 6:04 PM Updated Updated Aug 06, 2024 | 6:04 PM

Bal Jeevan Bima Yojana Scheme: మీరు మీ పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరకుంటున్నారా? భవిష్యత్తులో వారి కోసం కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారా? ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం పొందొచ్చు.

Bal Jeevan Bima Yojana Scheme: మీరు మీ పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరకుంటున్నారా? భవిష్యత్తులో వారి కోసం కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారా? ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం పొందొచ్చు.

  • Published Aug 06, 2024 | 6:04 PMUpdated Aug 06, 2024 | 6:04 PM
రోజుకు రూ. 18 పొదుపు చేస్తే లక్షల్లో లాభం!.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్!

సామాన్యులు సంపన్నులు కావాలంటే ఆలోచించే విధానం మారాలి. ఆలోచనే అసలైన పెట్టుబడి. పొదుపు చేస్తే సరిపోదు దాన్ని బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకోవాలి. అప్పుడే సంపద సమకూరుతుంది. పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వరంగాలకు చెందిన పథకాల్లో, సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. అయితే పిల్లల భవిష్యత్తు కోసం కూడా పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ పథకమే బాల్ జీవన్ బీమా యోజన.

పోస్టాఫీస్ ప్రవేశపెట్టిన బాల్ జీవన్ బీమా పథకంలో మీ పిల్లల పేరిట రోజుకు రూ. 6 పెట్టుబడి పెడితే చేతికి లక్ష రూపాయలు వస్తాయి. మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది. పిల్లల పేరిట రూ.6 నుంచి రూ.18 వరకు డిపాజిట్ చేయవచ్చు. అదే రూ. 18 చొప్పున పెట్టుబడి పెడితే రూ. 3 లక్షలు పొందొచ్చు. ఈ స్కీంలో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కు రూ. 1000 ప్రతి సంవత్సరం హామీ మొత్తం మీద రూ. 48 చొప్పున బోనస్ అందిస్తారు. బాల్ జీవన్ బీమా స్కీమ్ కేవలం చిన్నారుల కోసమే తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే చిన్నారుల తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బాల్ జీవన్ బీమా పథకంలో చేరాలంటే పిల్లల వయస్సు 5-20 సంవత్సరాల మధ్య ఉండాలి. 5-20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు పాల్ జీవన్ బీమా యోజన కోసం అప్లై చేసుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు సమీపంలోని పోస్టాఫీసులకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş