iDreamPost
android-app
ios-app

నెల నెలా ఆదాయం కావాలా?.. ప్రతీ నెల 40 వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

మీరు మంచి రాబడినిచ్చే పథకాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతీ నెల కొంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 40వేల వరకు పొందొచ్చు.

మీరు మంచి రాబడినిచ్చే పథకాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతీ నెల కొంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 40వేల వరకు పొందొచ్చు.

నెల నెలా ఆదాయం కావాలా?.. ప్రతీ నెల 40 వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

డబ్బు ధైర్యాన్నిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా మనీ ఉండాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరు డబ్బు వెనకాల పరుగెడుతున్నారు. డబ్బు సంపాదించే మార్గాలేంటా అని ఆరా తీస్తున్నారు. ఓ వైపు పెరుగుతున్న ఖర్చులు, ఆదాయం ఏమో అంతంత మాత్రమే. దీంతో చాలా మంది పార్ట్ టైమ్ జాబ్ లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నెల నెలా కొంత ఆదాయం కావాలని కోరుకుంటున్నారు. అయితే మీరు భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దని భావిస్తే ఆ స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి. ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు. నెలకు ఏకంగా 40 వేల వరకు అందుకోవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే.

వృద్ధాప్య దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదంటే ఇప్పటి నుంచే పొదుపు చేస్తే మేలు. డబ్బుల కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు పొదుపు చేసిన డబ్బుతో మీ అవసరాలను తీర్చుకునేలా ఉండాలి. ఇందుకోసం సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల ఆదాయం అందుకోవచ్చు. ఈ పథకంలో 18 నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

జాతీయ పెన్షన్ పథకంలో 21 ఏళ్ల వయస్సులో ప్రతి నెలా రూ.3,475 పెట్టుబడి పెడితే, 60 ఏళ్ల రిటైర్‌మెంట్ వయస్సు వచ్చేసరికి ప్రతి నెలా రూ.40,000 పెన్షన్ లభిస్తుంది. 21 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే, రిటైర్‌మెంట్ వయస్సు 60 ఏళ్లు అంటే 39 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెలా రూ.3,475 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.16,26,300 అవుతుంది. రాబడి 10 శాతంగా ఉంటుందని భావిస్తే ఆ వ్యక్తి రిటైర్‌మెంట్ వయస్సు వచ్చేసరికి మొత్తం డబ్బు రూ.2,00,19,029కి జమ అవుతుంది.

రిటైర్‌మెంట్ వయస్సు వచ్చినప్పుడు, పెట్టుబడిలో 60 శాతాన్ని లంప్‌సమ్‌గా తీసుకోవచ్చు. మిగిలిన 40శాతం డబ్బును పెన్షన్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ 40శాతం డబ్బును ప్రభుత్వం డెట్ ఫండ్స్‌ లేదా కార్పొరేట్ బాండ్స్‌లో పెట్టుబడి పెడుతుంది. ఈ పెట్టుబడి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తుంది. పెన్షన్‌పై 6శాతం వార్షిక రాబడి వస్తుంది అనుకుందాం. అలా అయితే పెన్షన్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.80,07,612 అవుతుంది, మంత్లీ పెన్షన్ రూ.40,038గా లభిస్తుంది.