iDreamPost

నెలకు 210 చెల్లిస్తే చాలు.. ప్రతీ నెల 5 వేల పెన్షన్ పొందొచ్చు.. ఎలా అంటే?

మీరు ప్రతినెల కొంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? మంచి రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 5 వేల పెన్షన్ పొందొచ్చు.

మీరు ప్రతినెల కొంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? మంచి రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 5 వేల పెన్షన్ పొందొచ్చు.

నెలకు 210 చెల్లిస్తే చాలు.. ప్రతీ నెల 5 వేల పెన్షన్ పొందొచ్చు.. ఎలా అంటే?

మీరు మంచి రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారా? ప్రభుత్వం అందించే పథకాల్లో పెట్టుబడిపెడితే అధిక లాభాలను అందుకోవచ్చు. తక్కువ పెట్టబడి, గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడంతో ప్రభుత్వ పథకాలకు ఆదరణ పెరిగింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. అదే అటల్ పెన్షన్ యోజన పథకం. అయితే ఇది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది ప్రభుత్వం. అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకంలో నెలకు 210 పొదుపు చేస్తే చాలు ప్రతీ నెల 5 పెన్షన్ పొందొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వాలు పెన్షన్ ను అందిస్తూ ఉంటాయి. అదే అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈ సౌకర్యం ఉండదు. అందుకే వీరికి కూడా 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అందాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే.. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం అందుకోవచ్చు. 18-40 సంవత్సరాల వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 40 ఏళ్లు దాటిన వారికి ఛాన్స్ లేదు. అటల్ పెన్షన్ యోజన స్కీంలో ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీం పరిధిలోకి వచ్చేవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కూడా ఈ పథకానికి అర్హులు కారు.

అటల్ పెన్షన్ యోజన పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు. ఇక ఈ అటల్ పెన్షన్ స్కీంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. లేదా బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి