iDreamPost
android-app
ios-app

LICలో మతిపోయే ప్లాన్.. ఒక్కసారి కడితే చాలు.. నెల నెలా రూ. 10 వేలు పొందొచ్చు

LIC New Jeevan Shanti Policy: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీలో క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 10 వేలు పొందొచ్చు.

LIC New Jeevan Shanti Policy: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీలో క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 10 వేలు పొందొచ్చు.

LICలో మతిపోయే ప్లాన్.. ఒక్కసారి కడితే చాలు.. నెల నెలా రూ. 10  వేలు పొందొచ్చు

ప్రభుత్వ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త ప్లాన్స్ ను తీసుకొస్తున్నది. కాలానుగుణంగా పాలసీలను రూపొందిస్తూ ప్రజలకు అందిస్తున్నది. అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుండడంతో ఎల్ఐసీ పాలసీలకు డిమాండ్ పెరిగింది. కోట్లాది మంది పాలసీ హోల్డర్లతో ఎల్ఐసీ దూసుకెళ్తున్నది. ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి రిస్క్ ఉండదు. పెట్టుబడి పెట్టి భారీ లాభాలు అందుకోవాలనుకునే వారు ఎల్ఐసీ పాలసీలు తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. కాగా ఉద్యోగం చేస్తున్నంత కాలం శాలరీ వస్తుంది. కాబట్టి ఏలోటు ఉండదు.

రిటైర్మెంట్ అనంతరం వివిద అవసరాలకు డబ్బు అవసరం పడుతుంది. మీకు వచ్చే పెన్షన్ సరిపోకపోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటే.. ఎల్ఐసీలో సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్. ఇందులో చేరితే నెలకు ఉచితంగా రూ. 10 వేలు పొందొచ్చు. మీరు ముందుగానే ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ తర్వాత నెల నెలా ఆదాయం పొందొచ్చు. ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారు ఎల్ఐసీ అందించే న్యూ జీవన్ శాంతి ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఈ పాలసీలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. ఏ రిస్క్ ఉండదు. ఈ పాలసీలో 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు.

ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీలో 55 ఏళ్ల వ్యక్తి.. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ రూపంలో రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. అప్పుడు సంవత్సరానికి రూ. 1,01,880 పెన్షన్ వస్తుంది. నెలవారీ లెక్కన చూస్తే ఇది రూ. 8,149 వరకు ఉంటుంది. అదే 30 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెడితే ఏడాదికి అందే పెన్షన్ రూ.1,32,920 అవుతుంది. అంటే నెలకు రూ.10 వేలకు పైగా చేతికి అందుతుంది. లైఫ్ లాంగ్ ఈ పెన్షన్ పొందొచ్చు. ఈ న్యూ జీవన్ శాంతి ప్లాన్‌లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1.50 లక్షలు. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఈ పథకం ద్వారా ప్రతినెలా అందుకునే పెన్షన్ పాలసీదారుడి వయస్సు, పెట్టుబడి పెట్టే మొత్తం, వాయిదా వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. ఇక పాలసీ మధ్యలో పాలసీదారులు మరణిస్తే.. అకౌంట్లో జమ చేసిన మొత్తం నామినీకి వస్తాయి. ప్రభుత్వరంగానికి చెందిన సంస్థ కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి నెల నెలా ఆదాయం పొందొచ్చు. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.