Vivo నుంచి తక్కువ ధరకే టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్!

Vivo T3 Pro 5G: వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే ధరలోనే వివో లాంచ్ చేసింది.

Vivo T3 Pro 5G: వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే ధరలోనే వివో లాంచ్ చేసింది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివోకి ఇండియాలో మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫోన్లలో బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లని మనం పొందవచ్చు.ఇక వివో గత కొంత కాలం నుంచి స్మార్ట్ ఫోన్ లవర్లను ఊరిస్తున్న వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే ధరలోనే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లో మనం ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ని పొందవచ్చు. ఇక ఈరోజు సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్స్, ఫీచర్లు ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంది. ఇది 3D కర్వుడ్ అమోల్డ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సైజు విషయానికి వస్తే.. ఇది కేవలం 7.49mm మందంతో మాత్రమే ఉంటుంది. అందువల్ల చాలా స్లీక్ గా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ క్వాల్కమ్ మిడ్ రేంజ్ ఫాస్ట్ చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ 870K+ AnTuTu స్కోర్ ని అందిస్తుంది.ఇక ర్యామ్ విషయానికి వస్తే.. 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB అదనపు ర్యామ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుంది. అలాగే ఇందులో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫన్ టచ్ OS 14 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 14 OS పై పని చేస్తుంది. దీని బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX882 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాలని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియోలను క్లారిటీగా తీయవచ్చు. ఆ వీడియోలను 30 fps వద్ద షూట్ చేయవచ్చు. అలాగే సూపర్ నైట్ మోడ్ తో సూపర్ క్వాలిటీ ఫోటోలు కూడా తీయవచ్చని వివో తెలిపింది. ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సల్ తో రానుంది. ఇంకా అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ లో AI ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్ వంటి మరిన్ని ఫీచర్లు, ఫిల్టర్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. కంపెనీ దీన్ని రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీన్ని రూ. 24,999 ధరతో విడుదల చేసింది. ఇక 8GB + 256GB వేరియంట్ ను అయితే రూ. 26,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ సెప్టెంబర్ 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై సూపర్ లాంచ్ ఆఫర్స్ ను కూడా వివో అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 3,000 డిస్కౌంట్ వస్తుంది. అంతేగాక ఈ ఫోన్ కి ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాంతో మీకు రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ని Flipkart మరియు vivo.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Show comments