iDreamPost
android-app
ios-app

299 రూపాయల పాస్ కేవలం ఒక్క రూపాయికే! అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు

  • Published Sep 03, 2024 | 4:59 PM Updated Updated Sep 03, 2024 | 4:59 PM

Unlimited Free Deliveries With 1 Rupee Pass: ఆన్ లైన్ లోనే ఫుడ్, కిరాణా సరుకులు ఆర్డర్ చేస్తున్నారు చాలా మంది. అయితే ఆర్డర్ చేసిన ప్రతిసారీ డెలివరీ ఛార్జీలు అవుతాయి. 500 రూపాయల పైన ఆర్డర్ చేస్తే ఎలాంటి డెలివరీ ఛార్జీలు ఉండవు కానీ ప్రతిసారీ 500 రూపాయల సరుకులు ఆర్డర్ చేయలేము కదా. అలాంటప్పుడు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకే ఒక్క రూపాయితో 100 రూపాయల ఆర్డర్ పై కూడా ఫ్రీగా డోర్ డెలివరీ పొందవచ్చు.

Unlimited Free Deliveries With 1 Rupee Pass: ఆన్ లైన్ లోనే ఫుడ్, కిరాణా సరుకులు ఆర్డర్ చేస్తున్నారు చాలా మంది. అయితే ఆర్డర్ చేసిన ప్రతిసారీ డెలివరీ ఛార్జీలు అవుతాయి. 500 రూపాయల పైన ఆర్డర్ చేస్తే ఎలాంటి డెలివరీ ఛార్జీలు ఉండవు కానీ ప్రతిసారీ 500 రూపాయల సరుకులు ఆర్డర్ చేయలేము కదా. అలాంటప్పుడు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకే ఒక్క రూపాయితో 100 రూపాయల ఆర్డర్ పై కూడా ఫ్రీగా డోర్ డెలివరీ పొందవచ్చు.

  • Published Sep 03, 2024 | 4:59 PMUpdated Sep 03, 2024 | 4:59 PM
299 రూపాయల పాస్ కేవలం ఒక్క రూపాయికే!  అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు

ఇప్పుడు చాలా మంది కిరాణా సరుకులను ఆన్ లైన్ యాప్స్ లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ వంటి యాప్స్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ఆర్డర్ చేసిన ప్రతిసారి డెలివరీ ఛార్జీలు అనేవి చెల్లించాల్సి ఉంటుంది. పైగా వర్షాలు పడినప్పుడు ఆ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం పాస్ ని పరిచయం చేశాయి ఆయా యాప్స్. ఈ పాస్ ని నెలకొకసారి తీసుకుంటే ఆర్డర్ చేసిన ప్రతిసారీ కిరాణా సరుకులను ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా పొందవచ్చు. అయితే ఒక్కో యాప్ ని బట్టి పాస్ ధరలు, షరతులు అనేవి వేరువేరుగా ఉంటాయి. స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ప్రతి నెలా వన్ మెంబర్ షిప్ పేరుతో ఒక పాస్ ఉంటుంది.

ఈ పాస్ ధర ప్రస్తుతం నాలుగు నెలలకు రూ. 30 ఉంది. 199 రూపాయల పైన ఆర్డర్ చేసుకుంటేనే ఈ ఫ్రీ డెలివరీ అనేది వర్తిస్తుంది. అలానే పండుగల్లో, పీక్ హవర్స్ లో అదనపు ఛార్జీలు ఉండవు. రెస్టారెంట్ ఫుడ్ పై కూడా అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు ఉన్నాయి. అయితే ఆర్డర్ 7 కి.మీ. పరిధిలోపు ఉన్న రెస్టారెంట్ దై ఉంటేనే ఫ్రీ డెలివరీ అనేది వర్తిస్తుంది. అది కూడా 199 రూపాయల పైన ఆర్డర్ అయి ఉండాలి. 199 రూపాయల కంటే తక్కువ ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ వర్తించదు. అదే జెప్టోలో అయితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 299 రూపాయల విలువ చేసే పాస్ ని కేవలం ఒక్క రూపాయికే అందిస్తుంది.

Zeptto

99 రూపాయల పైన కిరాణా సరుకులు ఆర్డర్ చేస్తే ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా ఎన్ని ఆర్డర్స్ అయినా ఒక నెలలో ఫ్రీ డోర్ డెలివరీ పొందవచ్చు. అంతేకాకుండా 299 రూపాయల పైన ఆర్డర్స్ చేస్తే 20 శాతం వరకూ అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. కూరగాయలు, పండ్ల కొనుగోళ్లు 299 రూపాయలు దాటితే కనుక అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఒక్క రూపాయి జెప్టో పాస్ తో మీరు నెలకు 400 రూపాయల వరకూ ఆదా చేసుకోవచ్చు. ఉచిత డెలివరీలు మాత్రమే కాకుండా అదనంగా ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్లు సహా పలు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మెంబర్ షిప్ ప్రస్తుతం ఒక నెలకు సెట్ చేశారు. ఫ్యూచర్ లో ఎక్కువ నెలలకు పాస్ తీసుకునేలా మెంబర్ షిప్ సదుపాయాన్ని తీసుకురానుంది కంపెనీ. జెప్టో సేవలు అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లోనూ ఈ పాస్ ప్రయోజనాలు వర్తిస్తాయి.    

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş