iDreamPost
android-app
ios-app

Union Budget 2024: బడ్జెట్‌లో సామాన్యులకు శుభవార్త.. ఇక నుంచి రూ. 20 లక్షలు

  • Published Jul 23, 2024 | 3:10 PM Updated Updated Jul 23, 2024 | 3:10 PM

Union Budget 2024-Doubles Mudra Loan Amount: బడ్జెట్‌లో సామాన్యులకు భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై వారికి 20 లక్షల వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

Union Budget 2024-Doubles Mudra Loan Amount: బడ్జెట్‌లో సామాన్యులకు భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై వారికి 20 లక్షల వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 23, 2024 | 3:10 PMUpdated Jul 23, 2024 | 3:10 PM
Union Budget 2024: బడ్జెట్‌లో సామాన్యులకు శుభవార్త.. ఇక నుంచి రూ. 20 లక్షలు

కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడో సారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. వారి కోసం అనేక రాయితీలు, పథకాలు తీసుకువచ్చారు. అలానే గతంలో ఉన్న వాటి నిధులను కూడా పెంచారు. ఇక బడ్జెట్‌లో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇకపై వారికి 20 లక్షల రూపాయల ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గతంలో పది లక్షల రూపాయలుగా ఉన్న దీన్ని.. ఇప్పుడు ఏకంగా డబుల్‌ చేసింది. దీని వల్ల సామాన్యులకు భారీ ఊరట కలగనుంది. ఆ వివరాలు..

ఈ ఏడాది బడ్జెట్‌లో రైతులు, మహిళలు, విద్యార్ధులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇక, బడ్జెట్-2024లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ముద్రా యోజనను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా.. 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్‌ ఇస్తుంది ప్రభుత్వం.

అయితే తాజా బడ్జెట్‌లో ఈ రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంటే.. ఇకపై రూ.20 లక్షల వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే లోన్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం యువతను వ్యాపార వేత్తలుగా మలిచేందుకు ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువతకు అండగా ఉంటామని నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము అన్నారు. వారు స్వయం ఉపాధి పొందేలా చేయడం కోసం ప్రభుత్వం లోన్లు ఇస్తుందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10లక్షల వరకూ రుణం లభిస్తుంది. అదే ఇప్పుడు ఆ లిమిట్ రూ. 20 లక్షలకు పెంచినట్లు చెప్పుకొచ్చారు.

ఇక, గ్రామీణ అభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషన్ కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించారు. ఇక మహిళలకు రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. అలానే మోడల్ స్కిల్లింగ్ లోన్ స్కీమ్ కింద ఇకపై రూ. 7.5 లక్షల వరకు రుణ సదుపాయం పొందొచ్చు. అలాగే 30 లక్షల మంది యువతకు ఒక నెల పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయనున్నారు.