iDreamPost
android-app
ios-app

Budget 2024 Analysis: కేంద్ర బడ్జెట్ 2024 హైలెట్స్ అండ్ అనాలసిస్! పూర్తి వివరాలతో..

  • Published Feb 01, 2024 | 2:44 PM Updated Updated Feb 01, 2024 | 2:44 PM

Union Budget 2024 Highlights & Analysis in Telugu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మరి మొత్తం బడ్జెట్‌ ఎంత.. ఏ శాఖలకు ఎంత కేటాయించారు అంటే..

Union Budget 2024 Highlights & Analysis in Telugu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మరి మొత్తం బడ్జెట్‌ ఎంత.. ఏ శాఖలకు ఎంత కేటాయించారు అంటే..

  • Published Feb 01, 2024 | 2:44 PMUpdated Feb 01, 2024 | 2:44 PM
Budget 2024 Analysis: కేంద్ర బడ్జెట్ 2024 హైలెట్స్ అండ్ అనాలసిస్! పూర్తి వివరాలతో..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించిన ఆర్థిక మంత్రి.. వ్యవసాయం, పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు ఎక్కువ భాగం కేటాయించారు.

ఫిబ్రవరి 1 గురువారం నాడు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు ఆర్థిక మంత్రి. గత 10 ఏళ్ల ఎన్డీయే సర్కారులో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన పథకాలు, వాటి పనితీరుపై తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పుకొచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. అనంతరం 2024-25 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు వెల్లడించారు. మొత్తం బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు ఎంతెంత కేటాయించారనేది తెలిపారు. శాఖలవారీగా బడ్జెట్‌ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

శాఖల వారిగా బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

  1. రైల్వే రంగానికి రూ.2.55 లక్షల కోట్లు
  2. ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ.2.78 లక్షల కోట్లు కేటాయించారు.
  3. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కోసం రూ.2.13 లక్షల కోట్లు కేటాయింపులు చేశౠరు.
  4. హోం శాఖకు రూ.2.03 లక్షల కోట్లు కేటాయించారు
  5. గ్రామీణాభివృద్ధి కోసం రూ.1.77 లక్షల కోట్లు
  6. రసాయనాలు, ఎరువులు రూ.1.68 లక్షల కోట్లు కేటాయింపులు చేశారు.
  7. కమ్యూనికేషన్లు రూ.1.37 లక్షల కోట్లు కేటాయింపులు చేశారు.
  8. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు

కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2024 – 2025 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేశారు.

  1. గ్రామీణ ఉపాధి హామీ పథకం – రూ.86 వేల కోట్లు కేటాయించారు
  2. ఆయుష్మాన్ భారత్ – రూ.7,500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
  3. పారిశ్రామిక ప్రోత్సాహకాలు – రూ.6,200 కోట్లు కేటాయింపులు చేశారు.
  4. సెమీ కండక్టర్స్, డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీ – రూ.6,903 కోట్లు కేటాయించారు
  5. సోలార్ విద్యుత్ గ్రిడ్ – రూ.8,500 కోట్లు కేటాయింపులు చేశారు.
  6. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ – రూ.600 కోట్లు కేటాయించారు.