Unclaimed Deposits-ew Nominee Rules, Bank Acc: బ్యాంకుల్లో మూలుగుతున్న రూ.78 వేల కోట్లు! దేశ ప్రజలకి శుభవార్త చెప్పిన కేంద్రం!

బ్యాంకుల్లో మూలుగుతున్న రూ.78 వేల కోట్లు! దేశ ప్రజలకి శుభవార్త చెప్పిన కేంద్రం!

Unclaimed Deposits-New Nominee Rules: తాజాగా ఆర్బీఐ వెల్లడించిన ఓ నివేదిక సంచలన విషయాలు ప్రకటించింది. దీని ప్రకారం బ్యాంకుల వద్ద సుమారు 78 వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నట్లు తెలిపింది. ఆ వివరాలు..

Unclaimed Deposits-New Nominee Rules: తాజాగా ఆర్బీఐ వెల్లడించిన ఓ నివేదిక సంచలన విషయాలు ప్రకటించింది. దీని ప్రకారం బ్యాంకుల వద్ద సుమారు 78 వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నట్లు తెలిపింది. ఆ వివరాలు..

బ్యాంకు ఖాతాలో డబ్బులుంటే.. అయిపోయే వరకు డ్రా చేస్తూనే ఉంటాము. నెలఖరు సరికి.. ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ తప్ప పెద్దగా ఎమౌంట్‌ ఉండదు. చాలా మంది విషయంలో ఇలానే జరుగుతుంది. కానీ పొదుపు అవశ్యకత తెలిసిన వారు.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు ఖాతాలో నగదు పొదుపు చేస్తుంటారు. చాలా మంది రెండు ఖాతాలు తెరుస్తారు. ఒక దాన్నుంచి లావాదేవీలు జరుపుతారు.. రెండో ఖాతాలో ప్రతి నెల ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. సేవింగ్స్‌ కోసం తెరిచిన అకౌంట్‌కు సంబంధించి ఏటీఎం కార్డు, యూపీఐ పేమెంట్స్‌ వంటివి ఏం ఉండవు. చాలా మంది ఇలాంటి సేవింగ్స్‌ అకౌంట్‌ గురించి కుటుంబ సభ్యులుకు చెప్పరు.

దురదృష్టవశాత్తు వారికేమైనా అయితే.. ఈ బ్యాంకు ఖాతాలో నగదు అలానే ఉండి పోతుంది. కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు కాబట్టి.. వీటిని క్లెయిమ్‌ చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలా ఆ మొత్తం బ్యాంకుల్లోనే ఉండి పోతుంది. చాలా కాలంగా దేశంలోని అనేక బ్యాంకుల్లో ఇలా ఎవరూ క్లెయిమ్‌ చేయని డబ్బు డిపాజిట్ల రూపంలో మూలుగుతోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ మొత్తం సుమారు 78 వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని సమాచారం.

ఇక బ్యాంకులు ఈ డబ్బులకు యజమాని ఎవరూ అనే విషయం తెలుసుకుని.. వారి కుటుంబ సభ్యులకు దీని గురించి సమాచారం అందించి.. వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయినా సరే ఈ అంశంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. దాంతో ప్రతి ఏటా ఇలా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు పెరుగుతూనే ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా నివేదిక ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన ఎవరూ క్లెయిమ్‌ చేయని సొమ్ము 26 శాతం పెరిగి.. రూ.78,213 కోట్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ మొత్తాన్ని క్లెయిమ్‌ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆర్బీఐ వెల్లడించింది.

ఇక రానున్న కాలంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌ చట్టాల(సవరణ) బిల్లు, 2024లో కీలక మార్పులు చేసింది. దీనిలో భాగంగా బ్యాంకింగ్‌ నిబంధనలను మార్చింది కేంద్ర ప్రభుత్వం. భవిష్యత్తుల్లో ఇలా ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు పెరగకుండా చూసేందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లకు నలుగురు నామినీలను పొందుపరచాలని ప్రతిపాదించింది. గతంలో ఇది ఒక్కరుగానే ఉండేది. అంటే ఇకపై బ్యాంక్‌ అకౌంట్‌కు నలుగురు నామినీలు ఉండనున్నారు.

Show comments