Uday Kotak resign: కొటక్ మహీంద్రా ఎండీ, సీఈఓ పదవికి ఉదయ్ కొటక్ రాజీనామా..

కొటక్ మహీంద్రా ఎండీ, సీఈఓ పదవికి ఉదయ్ కొటక్ రాజీనామా..

కొటక్ మహీంద్రా వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. దేశంలో ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ లో దిగ్గజ బ్యాంక్ గా కొనసాగుతున్న కొటక్ మహీంద్రా బ్యాంక్ 1985లో స్థాపించబడింది. గత 38 ఏళ్లుగా కస్టమర్లకు విశేషమైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నది. వ్యక్తిగత ఫైనాన్స్, లైఫ్ ఇన్స్ రెన్స్, ఇన్ వెస్ట్ మెంట్స్ వంటి సేవలను కస్టమర్లకు అందిస్తూ ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంక్ గా ఎదిగింది. అయితే ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు మూడు నెలల ముందుగానే మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవులకు రాజీనామా చేశారు.

కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రారంభంలో రూ. 10వేల పెట్టుబడితో మొదలవ్వగా నేడు దాదాపు రూ. 300 కోట్లకు చేరిందని ఉదయ్ కొటక్ తెలిపారు. కాగా ఈ దిగ్గజ బ్యాంకులో ఎండీ, సీఈఓగా ఉదయ్ పదవీ కాలం 2023, డిసెంబర్ 31తో ముగియనుండగా ముందుగానే తప్పుకున్నారు. ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంకులో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా.. డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా బ్యాంక్ ఎండీ, సీఈఓ పదవులు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా ఉదయ్ కొటక్ స్పందించారు. వ్యవస్థాపకులు వెళ్లిపోతారు. కానీ సంస్థ శాశ్వతంగా వర్థిల్లుతుందంటూ తెలిపారు. బ్యాంక్ వారసత్వన్ని ముందుకు తీసుకెళ్లడానికి అత్యుత్తమమైన నిర్వహణ బృందం ఉంది అని వెల్లడించారు. బ్యాంక్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో కొనసాగనున్నట్లు చెప్పారు.

Show comments