iDreamPost
android-app
ios-app

మాజీ మిస్ ఇండియాను పెళ్లాడిన ఉదయ్ కోటక్ కుమారుడు

  • Published Nov 09, 2023 | 7:10 PM Updated Updated Nov 09, 2023 | 7:11 PM

కొటక్ మహీంద్ర వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కుమారుడు మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్నారు. బిలియనీర్ అయిన జై కొటక్ అదితి ఆర్యను జియో కన్వెన్షన్ లో వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

కొటక్ మహీంద్ర వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కుమారుడు మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్నారు. బిలియనీర్ అయిన జై కొటక్ అదితి ఆర్యను జియో కన్వెన్షన్ లో వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

  • Published Nov 09, 2023 | 7:10 PMUpdated Nov 09, 2023 | 7:11 PM
మాజీ మిస్ ఇండియాను పెళ్లాడిన ఉదయ్ కోటక్ కుమారుడు

ప్రముఖ బిలియనీర్, కొటక్ మహీంద్ర వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కుమారుడు ఓ ఇంటివాడయ్యాడు. జై కోటక్ మాజీ మిస్ ఇండియా అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. మంగళ వారం నాడు జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే జైకోటక్, అదితి ఆర్యల ఎంగేజ్మెట్, పెళ్లి విషయాలను ఇరు కుటుంబాలు బయటకు వెళ్లడించలేదు. కాగా జై కోటక్ కొన్ని నెలల క్రితం వారి ఎంగేజ్మెంట్ విషయాన్ని వెల్లడించారు. తనకు కాబోయే భార్య యేల్ యూనివర్సిటీ నుంచి విజయవంతంగా ఎంబీఏ పట్టా పొందిందంటూ, చాలా గర్వంగా ఉందని సోషల్ మీడియాలో జై కోటక్ తెలిపారు.

ఇక జై కోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం కోటక్ మహీంద్ర బ్యాంక్ కు చెందిన డిజిటల్ ఫస్టు మొబైల్ బ్యాంక్ కోటక్ 811 కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదితి ఆర్య విషయానికి వస్తే.. సాక్రెడ్ హార్ట్ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్‌లో ఆమె ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేసింది. ఆ త‌ర్వాత గురుగ్రామ్‌లోని అమిటీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో చేరింది. ష‌హీద్ సుఖ్‌దేవ్ నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. స్ట‌డీస్ పూర్తి అయిన త‌ర్వాత ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ కంపెనీలో రీస‌ర్చ్ అన‌లిస్టుగా చేసింది. 2015లో జ‌రిగిన ఫెమీనా మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచింది. చైనాలో జ‌రిగిన ప్ర‌పంచ సుంద‌రి పోటీల్లో ఆర్య ఇండియా త‌ర‌పున పోటీప‌డింది. పూరి జ‌గ‌న్నాథ్ తీసిన ఇజ‌మ్ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ర‌ణ్‌వీర్ న‌టించిన 83 చిత్రంలో కూడా ఆమె న‌టించింది.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet