తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో రెండు వందే భారత్ రైళ్లు

Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాజాగా రైల్వే శాఖ మరో అదిరే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరీ, వాటి వివరాలేంటో చూద్దాం.

Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాజాగా రైల్వే శాఖ మరో అదిరే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరీ, వాటి వివరాలేంటో చూద్దాం.

ఇండియాన్ రైల్వే వ్యవస్థను మరీంత మెరుగు పరిచేందుకు ఇప్పటికే దేశంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే అత్యంత టెక్నాలజీతో, హై స్పీడ్ వేగంతో.. ఈ వందేభారత్ రైళ్లు పట్టాలపై పరిగెడుతున్నాయి. ఈ రైల్ల వలన అతి తక్కువ సమయంలోనే ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో చాలామంది ప్రయాణికులు ఈ వందేభారత్ రైళ్ల ప్రయాణంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో ఈ వందే భారత్ రైళ్లు అని నగరాల్లోని అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే ప్రయాణికుకలు రైల్వే శాఖ మరో అదిరే శుభవార్త చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ రెండు రైళ్లను ఈనెల 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ ప్రారంభించనున్నారు. కాగా, వీటిలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్ పూర్ మధ్య నడవగా.. మరోకటి ఏపీలో విశాఖపట్నం నుంచి ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. అయితే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధికంగా వందేభారత్ రైళ్లు  అనుసంధానత కలిగియున్నాయని ఈ మేరకు  కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే నాగ్ పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్ కు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవి రావాలని ఆహ్మానించినట్లు పేర్కొన్నారు.

ఇకపోతే నాగ్ పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరే ఈ వందేభారత్ ఎక్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోగా.. తిరిగి సికింద్రాబాద్ లో  మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20కి  నాగ్ పూర్ కు చేరుతుంది. అయితే నాగ్ పూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ సర్వీస్ మధ్యలో.. మహారాష్ట్రలోని సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్ష.. తెలంగాణలోని రామగుండం, కాజీపేట స్టేషన్లలో రెండు నిమిషాల చొప్పున ఆగుతాయి. అనగా.. నాగ్ పూర్-సికింద్రాబాద్ సర్వీసులో.. రామగుండం ఉదయం 9.08, కాజీపేట స్టేషన్ కు 10.04 గంటలకు చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్-నాగ్ పూర్ సర్వీస్ లో..కాజీపేట మధ్యాహ్నం 2.18, రామగుండం 3.13 గంటలకు చేరుకుంటుంది. కాగా, ఈ 578 కి.మీ మొత్తం దూరాన్ని ఈ వందేభారత్ రైళ్లు కేవలం  7.20 నిమిషాల్లో   చేరుకుంటుంది.

 ఇదిలా ఉంటే.. విశాఖపట్నం-దుర్గ్ విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అనేది ఏపీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ మూడు రాష్ట్రాల్లో సేవలు అందించనుంది. అయితే ఈ వందేభారత్ రైలు దుర్గ్ లో ఉదయం 5.45కి బయల్దేరి.. రాడ్పుర్ 6.08, మహాసముంద్ 6.38, ఖరియార్రోడ్ 7.15, కాంతబంజి 8.00, తిత్లాగఢ్ 8.30, కేసింగా 8.45, రాయగడ 10.50, విజయనగరం 12.35, విశాఖపట్నం మధ్యాహ్నం 1.45కి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.50కి బయల్దేరే ఈ రైలు విజయనగరం 3.33కి, దుర్గ్కి రాత్రి 10.50కి చేరుకుంటుంది. కాగా, ఈ 565 కి. మీ మొత్తం దూరాన్ని ఈ వందేభారత్ రైళ్లు కేవలం  8 గంటల్లో చేరుకోవడం గమన్హారం. మరీ, ఏపీకి మరోసారి కొత్తగా రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments