iDreamPost
android-app
ios-app

TVS Scooty Pep Plus, TVS Zest:మహిళల కోసం.. అతి తక్కువ ధరలో TVS నుంచి బెస్ట్ స్కూటర్స్

  • Published Aug 07, 2024 | 1:42 PM Updated Updated Aug 07, 2024 | 1:42 PM

TVS Scooty Pep Plus TVS Zest: తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటీల కోసం చూస్తున్నారా? అయితే టీవీఎస్ కంపెనీ నుంచి మహిళల కోసం బెస్ట్ స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?

TVS Scooty Pep Plus TVS Zest: తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటీల కోసం చూస్తున్నారా? అయితే టీవీఎస్ కంపెనీ నుంచి మహిళల కోసం బెస్ట్ స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?

  • Published Aug 07, 2024 | 1:42 PMUpdated Aug 07, 2024 | 1:42 PM
TVS Scooty Pep Plus, TVS Zest:మహిళల కోసం.. అతి తక్కువ ధరలో TVS నుంచి బెస్ట్ స్కూటర్స్

బైక్ ల కంటే స్కూటీలను నడపడం ఈజీగా ఉండడంతో స్కూటీలకు ఆదరణ పెరిగింది. పురుషులు, మహిళలు అందరూ స్కూటీలను యూజ్ చేస్తున్నారు. గేర్ లెస్ కారణంగా డ్రైవ్ చేసేందుకు మహిళలకు అనుకూలంగా ఉండడంతో స్కూటీలను విరివిగా వినియోగిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే మహిళా ఉద్యోగులు, పిల్లలను స్కూళ్లో దింపడానికి, తక్కువ దూరం ప్రయాణించడానికి స్కూటీలు బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో స్కూటీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. మహిళల కోసం టీవీఎస్ కంపెనీ నుంచి బెస్ట్ స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజీతో వచ్చే స్కూటీల కోసం ఎదురుచూస్తున్న వారికి టీవీఎస్ నుంచి అదిరిపోయే స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్, టీవీఎస్ స్కూటీ జెస్ట్ మహిళల కోసం బెస్ట్ స్కూటర్స్ అని చెప్పొచ్చు. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్.. దీని ధర రూ. 63060 నుంచి రూ. 66160 మధ్య ఉంటుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 87.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ లీటర్ కు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో హాలోజన్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ మరియు సైడ్ స్టాండ్ అలారం వంటి అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు కేవలం 93 కేజీలు మాత్రమే.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 72614 మరియు రూ. 73417 మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంటాయి. ఇది 109.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ స్కూటీ లీటర్ కు 48 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్ మరియు మ్యాట్ రెడ్ వంటి అనేక రంగులలో అందుబాటులో ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet