iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం..ఈరోజు ధరలు ఎంతంటే?

  • Published Sep 10, 2024 | 8:12 AM Updated Updated Sep 10, 2024 | 8:12 AM

Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat): మహిళలకు శుభవార్త.. ఇటీవల ప్రతిరోజూ బంగారం ధరలు దిగిస్తూనే ఉన్నాయి. గత నెల భారీగా పెరిగిన పసిడి ధరలు ఈ నెలలో అమాంతం దిగివస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టినపుడు పసిడి కొనుగోలు చేస్తే మంచిదని అంటున్నారు నిపుణులు

Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat): మహిళలకు శుభవార్త.. ఇటీవల ప్రతిరోజూ బంగారం ధరలు దిగిస్తూనే ఉన్నాయి. గత నెల భారీగా పెరిగిన పసిడి ధరలు ఈ నెలలో అమాంతం దిగివస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టినపుడు పసిడి కొనుగోలు చేస్తే మంచిదని అంటున్నారు నిపుణులు

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం..ఈరోజు ధరలు ఎంతంటే?

గత నెల శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది.దేశ వ్యాప్తంగా పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి మొదలైంది. ప్రపంచంలో ఎంతో విలువైన లోహం ఏదీ అంటే బంగారం అని చెబుతారు. ఏ లోహానికి లేని విశిష్టత దీనికి ఉంది. బంగారంతో ఎన్నో రకాల ఆభరణాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మగువలు పసిడి అంటే ఎంతో ఇష్టపడతారు. ఈ మధ్య కాలంలో బంగారం ఆభరణాలుగా మాత్రమే కాదు.. భవిష్యత్ లో మంచి పెట్టుబడికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు మిడిల్ క్లాస్ ప్రజలు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, ఇటీవల జరుగుతున్న యుద్దాల ప్రభావం పసిడి, వెండిపై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఈ ఏడాది మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. గత నెల నుంచి మళ్లీ పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి మొదలైంది. దీంతో పసిడి కొనుగోలు కూడా బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. గత నెల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత విదేశాల నుంచి దిగుమతి సుంకం 6 శాతం తగ్గించడంతో పసిడి ధరల్లో మార్పులు సంభవించాయి. ప్రస్తుతం 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,66,790 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,72,860 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,790ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,940 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,001 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.90,100 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.85,100, బెంగుళూరు‌లో రూ.83,400 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.90,100 వద్ద కొనసాగుతుంది.