iDreamPost
android-app
ios-app

వరుసగా దిగివస్తున్న పుత్తడి ధర.. ఈ రోజు ఎంతంటే?

  • Published Aug 28, 2024 | 8:10 AM Updated Updated Aug 28, 2024 | 8:10 AM

Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat): ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి.. ఎప్పుడు ఏ ధర ఉంటుందో కొనుగోలుదారులకు అర్థం కావడం లేదు. భారీగా మార్పులు జరగకపోయినా.. స్వల్ప మార్పుల్లోనే ఎంతో తేడాలు ఉంటాయి. ఈ రోజు మహిళలకు శుభవార్త.

Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat): ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి.. ఎప్పుడు ఏ ధర ఉంటుందో కొనుగోలుదారులకు అర్థం కావడం లేదు. భారీగా మార్పులు జరగకపోయినా.. స్వల్ప మార్పుల్లోనే ఎంతో తేడాలు ఉంటాయి. ఈ రోజు మహిళలకు శుభవార్త.

వరుసగా దిగివస్తున్న పుత్తడి ధర.. ఈ రోజు ఎంతంటే?

ప్రపంచంలో ఎంతో విలువైన లోహం ఏదీ అంట వెంటనే చెబుతారు బంగారం. ఏ లోహానికి లేని అందం.. ఆదరణ దీనికే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ పసిడి అంటే తెగ ఇష్టపడుతుంటారు. బంగారంతో ఎంతో అందమైన ఆభరణాలు తయారు చేస్తారు.. వాటిని ధరంచేందుకు మగువలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే మార్కెట్ లో కొంతకాలంగా పసిడి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక మార్పులు, యుద్దాల ప్రభావం పసిడి, వెండి ధరలపై చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఈ నెల శ్రావణ మాసం మొదలైంది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి మొదలైంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి తమ స్థాయికి కొనుగోలు చేస్తుంటారు. గత నెల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ లో బంగారం విదేశాల నుంచి దిగుమతి సుంకం 6 శాతం తగ్గించడంతో ఒక్క వారంలోనే రూ.7 వేల వరకు తగ్గిన పసిడి ధర ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చింది. గత మూడు రోజులుగా పసిడి తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,66,940 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,73, 030 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,940ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,030 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,800ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,170 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,930 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,020 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,930 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,020 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.93.600 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.88,600, బెంగుళూరు‌లో రూ.83,900 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.93,600 వద్ద కొనసాగుతుంది.