iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు ఊరట.. ఈరోజు ఎంత ఉందంటే..

  • Published Feb 12, 2024 | 7:37 AM Updated Updated Feb 12, 2024 | 7:37 AM

Gold and Silver Prices: ఈ మధ్య కాలంలో పసిడి, వెండి ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి.. మార్కెట్ లో స్థిరంగా ఉన్నపుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణుుల

Gold and Silver Prices: ఈ మధ్య కాలంలో పసిడి, వెండి ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి.. మార్కెట్ లో స్థిరంగా ఉన్నపుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణుుల

పసిడి ప్రియులకు ఊరట.. ఈరోజు ఎంత ఉందంటే..

కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం తులం రూ.60 లకు చేరుకుంది. రాబోయేది పెళ్లిళ్ల సీజన్.. దీంతో బంగారం కొనాలంటేనే భయకపడే పరిస్థితికి వచ్చింది. అయితే ఈ వారం రోజులుగా మాత్రం పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పొచ్చు. సాదారణంగా ఫెడ్ వడ్డీ దరలు పెంచిన వేల యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ కు డిమాడ్ పెరిగితే ఆ సమయంలో గోల్డ్ రేటు తగ్గుముఖం పడుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో సంభవిస్తున్న మార్పుల ప్రభావం కారణంగా కూడా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా పండుగలు, వివాహాది శుభకార్యాలకు అతివలు బంగారం కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. సమ్మర్ సీజన్ లో బంగారం కొనుగోలు ఎక్కువగానే ఉంటుంది. ఈ మద్య కాస్త బంగారం ధరలు తగ్గుతున్న కారణంగా కొనుగోలు చేయలానుకునే వారికి ఇది మంచి సమయం అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. గత మూడు రోజులుగా పసిడి పై రూ.300 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,500 వద్ద కొనసాగుతుంది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,840లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ63,090 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,940వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,590 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 76,400 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.74,900, బెంగుళూరు , కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.72,150 వద్ద ట్రెండ్ అవుతుంది.