iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. నేడు ఎంతంటే?

  • Published Feb 10, 2024 | 8:20 AM Updated Updated Feb 12, 2024 | 7:37 AM

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు నిత్యం తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. మార్కెట్ లో ఇప్పుడు పసిడి ధర తగ్గుముఖం పట్టింది.. ఈ సమయంలో కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు నిత్యం తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. మార్కెట్ లో ఇప్పుడు పసిడి ధర తగ్గుముఖం పట్టింది.. ఈ సమయంలో కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.

గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. నేడు ఎంతంటే?

భారత దేశంలో బంగారం కొనుగోలు మరీ ఎక్కువైంది. దీంతో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అతివలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో జరిగి మార్పులు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయి.. దీంతో తరుచూ వీటి ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంది. పసిడి కొనుగోలు దారులకు గొప్ప శుభవార్త. ఈ నెల మొదటి వారం బంగారం, వెండి స్వల్పంగా పెరిగినప్పటికీ.. మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం అంటున్నారు నిపుణులు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకంటే బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఈ పదిరోజుల్లో ఒక్కసారే బంగారం రేటు పెరిగింది… చాలా వరకు స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. పసడి ధర తగ్గినా.. వెండి ధర మాత్రం పెరిగింది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలవుతుంది.. వివాహాల కోసం బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశం అని చెప్పొచ్చు. సీజన్ మొదలైతే.. బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,890 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,150 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,600 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,040లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,300 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,890లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,840వద్ద కొనసాగుతుంది. కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,890 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 63,150 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,700 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.76,600లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.75,100, బెంగుళూరు , కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 72,600 వద్ద ట్రెండ్ అవుతుంది.