iDreamPost
android-app
ios-app

స్థిరంగా బంగారం ధరలు.. నేడు మార్కెట్ లో ఎంతుందంటే?

గత రెండు నెలలుగా పసిడి ధరలు నిత్యం పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం బంగారం పై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

గత రెండు నెలలుగా పసిడి ధరలు నిత్యం పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం బంగారం పై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

స్థిరంగా బంగారం ధరలు.. నేడు మార్కెట్ లో ఎంతుందంటే?

కొత్త ఏడాది పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెల వరుసగా ధరలు పెరిగిపోతూ వచ్చాయి. మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కోనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల వల్ల గోల్డ్ ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. న్యూ ఇయర్ ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. దీంతో జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల ఎలా ఉన్నాయో చూద్దాం..

గత మూడు నెలలుగా పసిడి, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో బంగారం కొనేందుకు మహిళలు ఆలోచనలో పడ్డారు. ధరలు పెరిగినా కానీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోళ్లు ఎక్కడా తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు బంగారం అనేది ఒక ఇన్వేస్ట్ మెంట్ గా చూస్తున్నారు.. భవిష్యత్ లో దేనికైనా ఉపయోగపడుతుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. నిన్న ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,870 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.

today gold rates

దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,970 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డు రేట్ రూ. 59,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 64,470 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు, కేరళా, ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,550 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,870 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 వద్ద కొనసాగుతుంది. ముంబాయి, కోల్‌కొతా, పూనే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,300 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,700 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి