iDreamPost
android-app
ios-app

మహిళలకు తీపి కబురు.. వరుసగా తగ్గుతున్న పసిడి! ఈ రోజు ఎంతంటే?

  • Published Aug 06, 2024 | 8:07 AM Updated Updated Aug 06, 2024 | 8:07 AM

Gold and Silver Rates: గత కొంత కాలంగా పసిడి, వెండి ధరలు నిత్యం పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల వరుసగా పసిడి, వెండి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితో సుమారు రూ.5 వేల వరకు పెరింది. ఈ మధ్య అనూహ్యంగా తగ్గుతూ వస్తుంది.

Gold and Silver Rates: గత కొంత కాలంగా పసిడి, వెండి ధరలు నిత్యం పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల వరుసగా పసిడి, వెండి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితో సుమారు రూ.5 వేల వరకు పెరింది. ఈ మధ్య అనూహ్యంగా తగ్గుతూ వస్తుంది.

మహిళలకు తీపి కబురు.. వరుసగా తగ్గుతున్న పసిడి! ఈ రోజు ఎంతంటే?

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. గత నెల నుంచి పసిడి, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇటీవల ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పసిడి, వెండి ధరల్లో భారీ మార్పులు సంభవించాయి. ఒక్క వారంలోనే రూ.7 వరకు తగ్గింది. అయితే వారం తర్వాత మళ్లీ పెరిగిపోతూ వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు.  గత మూడు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ, స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో ఎక్కువ శాతం మహిళలు బంగారం అంటే తెగ ఇష్టపడతారు. పండుగలు, పెళ్ళిళ్లు ఇతర శుభకార్యాలకు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతుందని.. అందువల్లే ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడి ధరలు అమాంతం తగ్గిపోయాయి. వారం రోజుల పాటు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. తగ మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి,64,690 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి,70,570 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70,570 వద్ద కొనసాగుతుంది.

today gold rate

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70,570 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,580 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.70,570 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.85,800 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.85,700, బెంగుళూరు లో రూ.85,000 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000 వద్ద కొనసాగుతుంది.