iDreamPost
android-app
ios-app

భారీగా తగ్గి.. వరుసగా షాక్ ఇస్తున్న గోల్డ్ రేటు.. నేడు ఎంతంటే?

  • Published Aug 02, 2024 | 8:05 AM Updated Updated Aug 02, 2024 | 8:05 AM

Gold and Silver Rates: ఇటీవల బడ్జెట్ సమావేశాల తర్వాత బంగారం ధరలు అమాంతం తగ్గిపోయాయి. వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు నిపుణులు.

Gold and Silver Rates: ఇటీవల బడ్జెట్ సమావేశాల తర్వాత బంగారం ధరలు అమాంతం తగ్గిపోయాయి. వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు నిపుణులు.

భారీగా తగ్గి.. వరుసగా షాక్ ఇస్తున్న గోల్డ్ రేటు.. నేడు ఎంతంటే?

ప్రపంచం అంతా ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి. గత రెండు మూడు నెలల క్రితం వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గత నెల కాస్త ఊరటనిచ్చాయి. ఇక కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో మరుసటి రోజు పసిడి, వెండి ధరలు ఏకంగా రూ.4 వేల వరకు దిగి వచ్చాయి. రెండు మూడు రోజులు వరుసగా ధరలు దిగివస్తూ రూ.7 వేలకు పైగా తగ్గింది. దీంతో మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు ఎగబడ్డారు. రెండు రోజుల మురిపం అన్నట్లుగానే పసిడి ధరలు మళ్లీ వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

దేశంలో ఆషాఢ మాసం మొదలైన తర్వాత పండగలు, శుభకార్యాల సీజన్ ప్రారంభం అయ్యింది.ఈ సమయంలో మగువలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. దానికి తోడు మొన్నామధ్య పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా గోల్డ్ దిగుమతులపై ట్యాక్స్ 15 నుంచి 6 శాతానికి తగ్గించారు. మరుసటి రోజునే ఏకంగా రూ.4వేల వరకు పసిడి ధరలు తగ్గడంతో జ్యులరీ షాపులు కిటకిటలాడాయి. దీంతో పసిడి డిమాండ్ బాగా పెరిగిపోయింది. మొన్నటి నుంచి పసిడి ధరలు మళ్లీ షాక్ ఇస్తూ పెరిగిపోతూ వస్తున్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి పై రూ.10 పెరిగి,64,510 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,70,370 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,510 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,370 వద్ద కొనసాగుతుంది.

Gold

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,660 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,520 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,310 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,160 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,510 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,370 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.91,800 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.87,200, బెంగుళూరు లో రూ.85,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.91,800 వద్ద కొనసాగుతుంది.