P Krishna
Gold and Silver Rates: ఇటీవల కేంద్రంలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మహిళలు పండుగ చేసుకున్నారు.. జ్యులరీ షాపులకు క్యూ కట్టారు. కానీ మళ్లీ హఠాత్తుగా ధరలు పెరిగి షాక్ ఇస్తున్నాయి.
Gold and Silver Rates: ఇటీవల కేంద్రంలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మహిళలు పండుగ చేసుకున్నారు.. జ్యులరీ షాపులకు క్యూ కట్టారు. కానీ మళ్లీ హఠాత్తుగా ధరలు పెరిగి షాక్ ఇస్తున్నాయి.
P Krishna
ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. బంగారం అన్ని లోహాల్లో కెల్లా అత్యంత అమూలమ్యమైనది. మహిళలు అలంకార ప్రియులు.. వారు రక రకాల బంగారు ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు వెరైటీ డిజైన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.గత కొన్ని సంవత్సరాల నుంచి పసిడి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆషాఢ మాసం మొదలైంది.. పండుగలు, శుభకార్యాల సీజన్ మొదలైంది. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. రానున్న రోజుల్లో పసిడి కొనుగోలు మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. దిగుమతి సుంకం 6శాతం తగ్గించడంతో ఈ ప్రభావం పడింది. కానీ అది రెండు రోజుల మురిపంగానే ఉంది. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. వివరాల్లోకి వెళితే..
మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం పూర్తయి.. శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఇక పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతుంది. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. గత రెండు నెలలుగా భారీగా పరిగిప పసిడి ధరలు 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత భారీగా తగ్గిపోయింది.ఒక్క వారంలోనే ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింది. దీంతో పసిడి కొనుగోలు ఊపందుకుంది. అయితే తగ్గినట్టే తగ్గి పసిడి మళ్లీ షాక్ ఇస్తుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి, 64,010కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,69,830 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,010 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,830 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,160ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,980 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,210 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,050 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,010 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,830 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.91,100 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.86,600, బెంగుళూరు లో రూ.83,900వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.91,100 వద్ద కొనసాగుతుంది.