iDreamPost
android-app
ios-app

రెండు రోజుల మురిపమే..మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి.. ఈ రోజు ఎంతంటే?

  • Published Jul 30, 2024 | 7:53 AM Updated Updated Jul 30, 2024 | 7:53 AM

Gold and Silver Rates: మొన్నటి వరకు బంగారం, వెండి దరలు పరుగులు పెట్టాయి.. 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి ధర అమాంతం తగ్గిపోయింది. దీంతో కొనుగోలుదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పసిడి మళ్లీ షాక్ ఇచ్చింది.

Gold and Silver Rates: మొన్నటి వరకు బంగారం, వెండి దరలు పరుగులు పెట్టాయి.. 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి ధర అమాంతం తగ్గిపోయింది. దీంతో కొనుగోలుదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పసిడి మళ్లీ షాక్ ఇచ్చింది.

రెండు రోజుల మురిపమే..మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో ఇటీవల పసిడి కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఒకప్పుడు బంగారం మహిళలు ఆభరణాలుగా మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పసిడి ఆభరణాలుగా కాకుండా భవిష్యత్ లో మంచి ఇన్వెస్ట్‌మెంట్ గా చూస్తున్నారు.. ఏ ఆపద సమయంలో అయినా సరే పసిడికి ఎంతో విలువ, డిమాండ్ ఉంటుంది, అందుకే మధ్యతరగతి కుటుంబీకులు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. గత నెల వరకు పసిడి, వెండి పరుగులు పెట్టింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బంగారం దిగుమతులపై కస్టమ్స్ ట్యాక్స్ ను 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో పసిడి ధరలు అమాంతం దిగివచ్చాయి.రెండు రోజుల మురిపం అన్నట్లుగానే మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గత వారం పార్లమెంట్ లో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అప్పటి వరకు చుక్కలు చూపిస్తూ వచ్చిన పసిడి ధరలు భారీగా తగ్గిపోయాయి. రెండు రోజులు వరుసగా ధరలు తగ్గడంతో మహిళలు బంగారం కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కట్టారు. మళ్లీ బంగారం ధరలు పెరిగిపోయాయి. పసిడి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,63,410 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి, 69, 170కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,410 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69, 170 వద్ద కొనసాగుతుంది.

Today Gold rates

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,560 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,320వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,140 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,970 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,410 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,170 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.88,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.84,400, బెంగుళూరు లో రూ.84,150 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900 వద్ద కొనసాగుతుంది.