iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

  • Published Jun 24, 2024 | 7:35 AM Updated Updated Jun 24, 2024 | 8:07 AM

బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వరుసగా పెరుగుతు షాకిస్తున్న గోల్డ్ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం ఎంత ఉందంటే?

బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వరుసగా పెరుగుతు షాకిస్తున్న గోల్డ్ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం ఎంత ఉందంటే?

  • Published Jun 24, 2024 | 7:35 AMUpdated Jun 24, 2024 | 8:07 AM
గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

మనదేశంలో బంగారానికి ఎంతటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏ చిన్న శుభకార్యమైనా కూడా బంగారం కొనేందుకు రెడీ అవుతుంటారు. పండగలు, పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షన్లు ఇలా సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరుగుతుండడంతో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అంతేకాదు బంగారం తమ వద్ద ఉన్నట్లైతే ఆపద సమయంలో ఆదుకుంటుంది. మరి మీరు కూడా గోల్డ్ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. నేడు తులం పుత్తడి ధర ఎంత ఉందంటే?

ఇటీవల ఆకాశాన్నంటిన గోల్డ్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకరోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ షాకిస్తున్న బంగారం ధరలు వినియోగదారులకు నేడు ఊరటకలిగించాయి. దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేడు తులం బంగారంపై రూ. 10 తగ్గింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340వద్ద ట్రేడ్ అవుతున్నది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,370 వద్ద అమ్ముడవుతున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.66,490వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. గోల్డ్ తో పాటు పోటీపడిన సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 96,400 కిచేరింది. ఇక విజయవాడ, చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతున్నది. హస్తినలో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద ట్రేడ్ అవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం వంటి కారణాలు బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş