P Krishna
Gold and Silver Prices: గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పసిడి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. రాబోయే పెళ్లిళ్ల సీజన్ లో మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Gold and Silver Prices: గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పసిడి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. రాబోయే పెళ్లిళ్ల సీజన్ లో మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
P Krishna
ఇటీవల సామాన్యులు బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. గత ఏడాది వరుసగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏడాది చివరన డిసెంబర్ మాసంలో పసిడి ధరలు చుక్కలు చూపించాయి. బంగారం ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం పసిడి, వెండి పై పడటం వల్ల తరుచూ ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది.. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ సమయంలో కొనుగోలుదారులకు ఊరటనిచ్చే విధంగా పసిడి తగ్గుముఖం పట్టింది. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కాని పరిస్థితి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అని అంటున్నారు. దేశయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,950 వద్ద కొనసాగుతుంది. నేడు కిలో వెండి పై రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,900 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ62,980 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,590లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,830 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.63,370 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 76,900 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.75,400, బెంగుళూరు , కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.72,850 వద్ద ట్రెండ్ అవుతుంది.