P Krishna
P Krishna
దేశంలో బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమ బడ్జెట్ ని బట్టి పండుగలు, శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఆ మద్య బంగారం రేట్లు పెరిగిపోతూ సామాన్యులను కలవర పెట్టాయి. దీంతో మధ్యతరగతి కుటుంబీకులకు బంగారం అందని ద్రాక్షగా మారింది. కానీ గత పదిరోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. గత పదిరోజులుగా బంగారం, వెండి రేట్లు వరుసగా కుప్పకూలిపోతున్నాయి. బంగారం ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయినట్లు చెబుతున్నారు. పదిరోజుల్లోనే దాదాపు రూ.4 వేలకు దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.600కు పడిపోయింది. తులం బంగారం రేటు రూ.52,600 ట్రెండ్ అవుతుంది. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.660 తగ్గి ప్రస్తుతం రూ.57,380 కి దిగివచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.52,750 గా ట్రెండ్ సాగుతుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,530గా ట్రెండ్ సాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.2 వేలు తగ్గి రూ.73,500 లు కొనసాగుతుంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2000 వేలకు తగ్గి రూ.7,1000 గా కొనసాగుతుంది. ఇప్పుడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచి లాభం ఉటుందని నిపుణులు చెబుతున్నారు.