పసిడి కొనేవారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

ఈ మధ్యకాలంలో ఏ విధమైన వేడుకైన గోల్డ్ కొనేవారి సంఖ్య ఎక్కువై పోతోంది. ధరలు ఎక్కువైనా కూడా బంగారం కొనడానికి వెనకాడట్లేదు. పెళ్లిల్లకు, శుభకార్యాలకు బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో బంగారం కొనాలను కునే వారికి పసిడి ధరలు షాకిచ్చాయి. గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న ధరలు నేడు స్పల్పంగా పెరిగాయి. దీంతో గోల్డ్ ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి. కాగా నేడు దేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు నిన్నటితో పోల్చితే నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 54,910 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 59,900 వద్ద కొనసాగతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,910 ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 వద్ద అమ్ముడవుతోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 78, 200 వద్దకు చేరింది. హస్తినలో కేజీ వెండి ధర 74,700 వద్ద అమ్ముడవుతోంది.

Show comments