iDreamPost
android-app
ios-app

అదిరిపోయే శుభవార్త.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు. ఈ రోజు ఎంతంటే?

  • Published Sep 02, 2024 | 8:04 AM Updated Updated Sep 02, 2024 | 8:04 AM

Today Gold and Silver Rates in Hyderabad (22 and 24 carat): ఇటీవల బంగారం, వెండి ధరలు పెరిగిపోతూ కొనుగోలుదారులను కలవరానికి గురి చేస్తూ వచ్చాయి. మధ్యతరగతి కుటుంబీకులు బంగారం కొనగలమా అన్న అనుమానాలు వస్తున్నాయి.. ఇదిలా ఉంటే బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి.

Today Gold and Silver Rates in Hyderabad (22 and 24 carat): ఇటీవల బంగారం, వెండి ధరలు పెరిగిపోతూ కొనుగోలుదారులను కలవరానికి గురి చేస్తూ వచ్చాయి. మధ్యతరగతి కుటుంబీకులు బంగారం కొనగలమా అన్న అనుమానాలు వస్తున్నాయి.. ఇదిలా ఉంటే బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి.

అదిరిపోయే శుభవార్త.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు. ఈ రోజు ఎంతంటే?

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. గత నెల నుంచి శ్రావణ మాసం నుంచి వరుసగా పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి మొదలైంది. ఇక పండగల సీజన్ కూడా ప్రారంభం కావడంతో మహిళలు బంగారం కొనుగోలు చేయడం ఎక్కువైంది. ఇటీవల పసిడి ధరలు వరుసగా పెరిగిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ లో బడ్జెట్ సమయంలో కేంద్రం బంగారం, వెండి పై సుంకం తగ్గించగా మరుసటి రోజు నుంచి వారం పాలు రూ.7 వేల వరకు తగ్గుతూ వచ్చింది.మళ్లీ వారం తర్వాత పెరిగిపోతూ వస్తుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి నేలకొడంతో పసిడి, వెండి ధరలు ఎతబాగుతున్నాయని నిపుణులు అంటున్నారు. వారం రోజులుగా పెరిగిన పసిడి ధరల అంతర్జాతీయ మార్కెట్ లో గరిష్ట స్థాయికి దిగివచ్చంది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

పసిడి కొనుగోలు చేసే మగువలకు గొప్ప శుభవార్త. వారం రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి నేడు తగ్గింది. అలాగే దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో పెద్దగా మార్పులు ఏవీ కనిపించలేదు. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గి, రూ.66,940 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.10 తగ్గి, రూ.73,030 కి చేరింది. తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,030 వద్ద కొనసాగుతుంది.

today gold rate

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,090 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,030 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,030 వద్ద కొనసాగుతుంది. ముంబై, పూణే,కేరళా, కోల్‌కొతా, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,940 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,030 వద్ద కొనసాగుతుంది. దేశంలో కిలో వెండి ధరపై రూ.100 తగ్గింది.చెన్నై, కేరళా, హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కిలో వెండి ధర రూ.91,900 పలుకుతుంది. ఢిల్లీ, కోల్ కొతా లో కిలో వెండి రూ. 86,900, బెంగుళూరు లో రూ. 84,900 నమోదైంది.