iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. నేడు గోల్డ్‌ రేటు ఎంతుందంటే

  • Published Aug 21, 2023 | 8:10 AM Updated Updated Aug 21, 2023 | 8:10 AM
  • Published Aug 21, 2023 | 8:10 AMUpdated Aug 21, 2023 | 8:10 AM
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. నేడు గోల్డ్‌ రేటు ఎంతుందంటే

ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు.. జీవిత కాల గరిష్టాలకు చేరిన బంగారం ధరలు.. ఆగస్టు నెలలో మాత్రం దిగి వస్తున్నాయి. గత పది రోజులుగా చూసుకుంటే.. గోల్డ్‌ రేటు తగ్గడం లేదంటే.. స్థిరంగా ఉండటం జరుగుతుంది. ఇక ఈ ఏడాది శ్రావణమాసంలో బంగారం ధర దిగి రావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. శ్రావణమాసంలో చాలా మంది మహిళలు కచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం బంగారం ధరలు దిగి వస్తుంటంతో.. గోల్డ్‌ ఎక్కువ కొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు బంగారం ధర ఎంత ఉంది.. అంటే..

నేడు మన హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధర స్థిరంగా ఉంది. గత మూడు రోజులగా ధరలో ఎలాంటి మార్పు లేదు ఇక నేడు కూడా గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 54,100 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 59,020 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని హస్తినలో కూడా బంగారం ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదు. నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 54,250 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 59,170 మార్క్ వద్ద కొనసాగుతోంది.

స్థిరంగా వెండి ధర..

ఇక క్రితం సెషన్‌లో వెండి ధర హైదరాబాద్‌, ఢిల్లీల్లో కిలో మీద 200 రూపాయలు తగ్గింది. ఇక నేడు సిల్వర్‌ రేటు స్థిరంగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 వద్ద కొనసాగుతుంది. భాగ్యనగరంలో కూడా వెండి ధర స్థిరంగా ఉంది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర 76,500 రూపాయలుగా ఉంది. శ్రావణమాసంలో బంగారం, వెండి ధరలు ఇలా దిగి రావడం, స్థిరంగా ఉండటం పసిడి ప్రియలుకు కలిసి వచ్చే అవకాశం అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.