iDreamPost
android-app
ios-app

రాఖీ పండగకు షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

  • Published Aug 18, 2024 | 10:55 AM Updated Updated Aug 18, 2024 | 10:55 AM

Gold and Silver Rates: సాధారణంగా పండగలు, శుభకార్యాలకు మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. తమ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. రాఖీ పండుగ సందర్భంగా పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి.

Gold and Silver Rates: సాధారణంగా పండగలు, శుభకార్యాలకు మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. తమ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. రాఖీ పండుగ సందర్భంగా పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి.

  • Published Aug 18, 2024 | 10:55 AMUpdated Aug 18, 2024 | 10:55 AM
రాఖీ పండగకు షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

శ్రావణ మాసం సీజన్ మొదలైంది.. పండగులు,పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి ప్రారంభం అయ్యింది. మొన్నటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండగ తెలుగు ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పండగ, శుభకార్యాలకు తమ స్థాయికి తగ్గట్టు పసిడి కొనుగోలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి. గత నెల పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. విదేశాల నుంచి గోల్డ్ దిగుమతులపై ట్యాక్స్ తగ్గించారు. దీంతో పసిడి ధరలు భారీగా తగ్గిపోయాయి.. కానీ పది రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా పసిడి మళ్లీ షాక్ ఇస్తూ ధరలు పెరిగిపోయాయి. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. జ్యులరీ షాపుల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీ డిజైన్లతో మగువులను ఆకర్షించే విధంగా ఆభరణాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి మహిళలు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. రేపు రాఖీ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ల ప్రేమ బంధం.. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదరి ప్రేమకి సంకేతం. రాఖీ పౌర్ణమి సందర్బంగా పసిడి కొనుగోలు బాగా జరుగుతుంది. మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం నాటికి తులం బంగారం రూ.1100 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.66,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.726,770కు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.72,770ల వద్ద కొనసాగుతుంది.

దేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. జ్యులరీ షాపుల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీ డిజైన్లతో మగువులను ఆకర్షించే విధంగా ఆభరణాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి మహిళలు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. రేపు రాఖీ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ల ప్రేమ బంధం.. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదరి ప్రేమకి సంకేతం. రాఖీ పౌర్ణమి సందర్బంగా పసిడి కొనుగోలు బాగా జరుగుతుంది. మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం నాటికి తులం బంగారం రూ.1100 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.66,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.726,770కు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.72,770ల వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1900 వరకు ఎగబాకింది. హైదరాబాద్, చెన్నై, కేరళాలో కిలో వెండి ధర రూ.91,000 లకు చేరింది.