Dharani
ఎన్నికల ఫలితాల రోజున పసిడి ప్రియులకు భారీ శుభవార్త. వారికి ఇది అదిరే ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంతకు ఏం జరిగింది.. ఏంటా అవకాశం అంటే..
ఎన్నికల ఫలితాల రోజున పసిడి ప్రియులకు భారీ శుభవార్త. వారికి ఇది అదిరే ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంతకు ఏం జరిగింది.. ఏంటా అవకాశం అంటే..
Dharani
మరి కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇప్పటికే టీవీలు, సోషల్ మీడియాకు అతుక్కుపోయారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా.. నేడు అనగా జూన్ 4, మంగళవారం నాడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నేటి సాయంత్రం నాటికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా భారీ ఉత్కంఠత నెలకొని ఉంది. ఇక రిజల్ట్ కోసం జనాలు, నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేటి ఎన్నికల ఫలితాలు.. స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ మీద భారీగా ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల వేళ.. పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. ఇంతకు ఏంటా గుడ్‌న్యూస్ అంటే..
బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట కలగనుంది. గత వారం నుంచి వరుసగా దిగి వస్తోన్న పసిడి రేటు.. ఈరోజు కూడా భారీగా పడి పోయింది. అయితే ఎన్నికల వేళ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగ్గా.. అందుకు భిన్నంగా మన దేశంలో గోల్డ్ రేటు దిగి రావడం గమనార్హం. ఇక నేడు అనగా మంగళవారం నాడు మన దగ్గర పసిడి రేటు భారీగా పడిపోయింది. ఇవాళ ఒక్క రోజే పుత్తడి ధర పది గ్రాముల మీద 400 రూపాయలు దిగి వచ్చింది. ఇక గత వారం రోజుల నుంచి చూస్తే.. ఏకంగా 10 గ్రాముల మీద 1000 రూపాయలు దిగి వచ్చింది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
నేడు హైదరాబాద్ నగరంలో నేడు పసిడి ధర దిగి వచ్చింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ ధర పది గ్రాముల మీద 400 దిగి వచ్చింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 66,100 కు చేరింది. అలానే 24 క్యారెట్ పుత్తడి రేటు కూడా దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద 440 రూపాయలు తగ్గి.. రూ. 72,110 కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర దిగి వచ్చింది. ఇక్కడ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద రూ. 400 తగ్గి.. రూ. 66,250కు చేరింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 440 దిగి వచ్చి.. రూ. 72,260 వద్ద కొనసాగుతోంది.
ఇక నేడు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. దిగి వచ్చింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నేడు ఒక్క రోజు వెండి ధర కిలో మీద ఏకంగా రూ. 700 పడిపోయింది. దాంతో నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 92,800కు దిగి వచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో కూడా సిల్వర్ రేటు రూ. 700 పడిపోయి ప్రస్తుతం కిలో రూ. 97,300 కు చేరింది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. అందుకు ఆయా ప్రాంతాల్లోని పన్నుల్లో తేడాలు.