P Krishna
P Krishna
భారత దేశంలో ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా బంగారం మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకే దేశంలో బంగారానికి ఎంతో డిమాండ్ ఉంది. ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అన్న కన్ప్యూజ్ లో కొనుగోలుదారులు ఉన్నారు. నాలుగైదు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వివరాల్లోకి వెళితే..
బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల కాలంలో వరుసగా పెరిగిపోతూ వచ్చిన బంగారం గత వారం రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తుంది. ఈ రోజు భారీగా బంగారం ధరలు తగ్గాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనాలనుకునే మహిళలు ఇదే మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. రాబోయే పండుగల సీజన్ కి మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.200 పడిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 పలుకుతుంది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.220 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.59,730 పలుకుతుంది. విజయవాడలో కూడా బంగారం ధర 22 క్యారెట్స్ 10 గ్రాములు రూ.54,750 గా ఉండగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రూ.59,730 ధర పలుకుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాములు గోల్డ్ రేట్ రూ.54,900లు ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ.59,880 పలుకుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ.55,050 లు, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ.60,050 ట్రెండ్ అవుతుంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.74,600లు గా ఉంది. ముంబైలో రూ.74,800, చెన్నైలో 77,600 గా నమోదు అయ్యింది.