Vinay Kola
RBI: ఆర్బిఐ చాలా బ్యాంకులకు కూడా కేవైసి ప్రక్రియ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేసింది. ఈ క్రమంలో చాలా బ్యాంకులు కూడా కేవైసి లేని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి.
RBI: ఆర్బిఐ చాలా బ్యాంకులకు కూడా కేవైసి ప్రక్రియ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేసింది. ఈ క్రమంలో చాలా బ్యాంకులు కూడా కేవైసి లేని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి.
Vinay Kola
ఈరోజుల్లో చాలా మందికి కూడా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే బ్యాంకు అకౌంట్‌కు కేవైసీ అనేది కచ్చితంగా ఉండాలి. కేవైసీ లేని అకౌంటు లని బ్యాంక్ క్లోజ్ చేస్తుంది. ఇటీవల కేవైసీ లేని అకౌంట్లు ఉన్న బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ మందలించింది.అంతేగాక కస్టమర్ల KYCని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడంలో బ్యాంక్ ఆలస్యం చేయకూడదు. కానీ చాలా బ్యాంకులు ఆలస్యం చేస్తున్నాయి. కస్టమర్లకు సహాయం చేయడంలో బ్యాంక్ ఉద్యోగులు చురుకైన విధానం పాటించాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు సరిపడా సిబ్బంది కచ్చితంగా ఉండాలి. చాలా బ్యాంక్ ఉద్యోగులు కూడా కస్టమర్‌కు పని చేసే విధానంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.ప్రతి పని కోసం కస్టమర్‌ను హోమ్ బ్రాంచ్‌కు పంపిస్తున్నారు.కస్టమర్ నుండి అవసరమైన అన్ని పత్రాలు అందినా కూడా సిస్టమ్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో చాలా మంది బ్యాంక్ ఉద్యోగులు ఆలస్యం చేస్తున్నారు. ఇలాంటి బ్యాంక్ లపై RBI విరుచుకుపడుతుంది.
అయితే KYC లేనందున ప్రభుత్వం నుండి Direct Benifit Transfer (DBT) డబ్బులను పొందిన వ్యక్తుల అకౌంట్ లను కూడా బ్యాంకులు ఫ్రీజ్ చేస్తున్నాయి. చాలా మందికి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ, పెన్షన్ లేదా స్పెషల్ స్కీమ్ నుండి వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతూ ఉంటాయి. ఇంకా ఇది కాకుండా, రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులు కేవైసీ అప్‌డేట్‌ను లేట్ చేసినందుకు పెనాల్టీ వేయడమో.. లేక అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడమో లాంటివి చేస్తుంటాయి. అందువల్ల చాలా బ్యాంకులు ఆర్బిఐ భయంతో KYC లేని అన్నీ బ్యాంక్ అకౌంట్లని కూడా ఫ్రీజ్ చేస్తున్నాయి. అయితే దీని వల్ల ప్రభుత్వ పథకాల నుంచి డబ్బులు పొందుతున్న వారి అకౌంట్లు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి.
అయితే ప్రైవేట్ బ్యాంకుల డైరెక్టర్లను ఉద్దేశించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ మాట్లాడుతూ, బ్యాంకులు కేవైసీ గైడ్లెన్స్ ని కచ్చితంగా ఫోలో అయ్యేలా చూసుకోవాలని అన్నారు. ఈ విషయం గురించి ఆర్‌బీఐ గతంలో కూడా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని ఆయన తెలిపారు. అయితే వీటిలో కేవైసీ లేని ప్రభుత్వ పథకాల డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే అకౌంట్లను బ్యాంకులు ఫ్రీజ్ చేయకూడదని అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే బ్యాంక్ అకౌంట్లు నిలిచిపోవని అవి పని చేస్తాయని క్లారిటీ ఇచ్చింది RBI. అయితే మిగతా బ్యాంక్ అకౌంట్లు మాత్రం కచ్చితంగా KYC చేసుకొని ఉండాలి. అలాంటి అకౌంట్లు ఫ్రీజ్ ఐపోతాయి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.