iDreamPost
android-app
ios-app

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలా?.. బడ్జెట్‌లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

  • Published Jul 04, 2024 | 4:21 PM Updated Updated Jul 04, 2024 | 4:21 PM

Recharge plans: పెరిగిన రీఛార్జ్ ధరలతో భయపడిపోతున్నారా? అయితే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ లో ఈ ప్లాన్స్ ట్రై చేయండి.

Recharge plans: పెరిగిన రీఛార్జ్ ధరలతో భయపడిపోతున్నారా? అయితే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ లో ఈ ప్లాన్స్ ట్రై చేయండి.

  • Published Jul 04, 2024 | 4:21 PMUpdated Jul 04, 2024 | 4:21 PM
ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలా?.. బడ్జెట్‌లో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

ఇటీవల మొబైల్ యూజర్లకు టెలికాం కంపెనీలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిగ్గజ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను భారీగా పెంచాయి. ఓవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఫోన్ రిఛార్జ్ ధరల పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయ్యింది. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ధరలు జులై 03 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఫోన్ ఉపయోగించాలంటే రీఛార్జ్ కూడా తప్పనిసరి. అయితే పెరిగిన రీఛార్జ్ ధరలతో యూజర్లు రీఛార్జ్ చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా మొబైల్ యూజర్లు కాస్త ఊరట చెందొచ్చు. అవేంటంటే?

జియో రూ. 189 ప్లాన్‌:

  • యూజర్ల కోసం జియో రూ. 189 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 2 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. నెలకు 1000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే జియో టీవీతో పాటు, జియో సినిమాకు ఉచిత యాక్సెస్‌ లభిస్తుంది.

ఎయిర్‌టెల్‌ రూ. 219ప్లాన్:

  • ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ. 219తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 3 జీబీ డేటా పొందొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఫ్రీ హలోట్యూన్స్ కూడా పొందొచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ. 199ప్లాన్:

  • రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో 2 జీబీ డేటా పొందొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

వొడాఫోన్ ఐడియా రూ. 199ప్లాన్:

  • రూ. 199 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిడెట్‌ కాల్స్‌ పొందొచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 249 ప్లాన్:

  • బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. తాజాగా కొత్త రూ. 249 రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. జియో తెచ్చిన రూ. 249 ప్లాన్ తో 45 రోజుల పాటు వ్యాలిడిటీని పొందొచ్చు. రోజుకు 2జీబీ డేటా వస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom